ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఎప్పటిలాగే, ఈ ఏడాది కూడా ఐపీఎల్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయి ఉన్నాయి. ఈ వేడుకలో అనేక మంది సినీ తారలు పాల్గొననున్నారు.
ప్రసిద్ధ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, శ్రద్ధా కపూర్, సంజయ్ దత్ మొదలైన వారు ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. అంతేకాకుండా, ప్రపంచప్రసిద్ధ అమెరికన్ పాప్ బ్యాండ్ “వన్ రిపబ్లిక్” అదిరిపోయే లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనుంది.

ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా జట్టు యజమాని షారుఖ్ ఖాన్ ఈ వేడుకలో పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం ‘సికందర్’ను ప్రమోట్ చేసే అవకాశం ఉంది.
అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్, కరణ్ ఆజ్లా, దిశా పటాని, శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ వంటి స్టార్ సెలబ్రిటీల స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోనుంది. కరణ్ ఆజ్లా, దిశా పటాని కలిసి “వన్ రిపబ్లిక్” బ్యాండ్‌తో “టెల్ మీ” అనే పాటను ప్రదర్శించే అవకాశముంది.
అలాగే కత్రినా కైఫ్, అనన్య పాండే, మాధురీ దీక్షిత్, జాన్వీ కపూర్, కరీనా కపూర్, పూజా హెగ్డే, ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ తారలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్లో మొత్తం 23 వేదికల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ గత ఏడాది విజేతగా నిలిచిన కారణంగా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.