ఐపీఎల్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కి పండుగ! వేదిక ఎక్కడైనా, టీమ్ ఏదైనా.. అభిమానులు స్టేడియాలను హోరెత్తిస్తారు. బ్యాట్స్‌మెన్ బాదుడు, బౌలర్ల సునామీ, ఫీల్డింగ్ లో విన్యాసాలు – అన్నీ కలిసి అభిమానులకు పీక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. ఇప్పుడది మరింత పెంచేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది.

తమన్ మ్యూజిక్‌తో అదిరే ఎంటర్‌టైన్‌మెంట్
రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఫ్యాన్స్ భారీగా హాజరవుతున్నారు. వారి కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు.
దేశవ్యాప్తంగా ఐపీఎల్ స్టేడియాల్లో మ్యాచ్‌ల ముందు సంగీత ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కి ముందు అనిరుధ్ సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజిక్ షో అభిమానులను ఉర్రూతలూగించనుంది.
మ్యాచ్ ముందు మ్యూజిక్ మస్తీ
తమన్ హిట్ సాంగ్స్‌తో స్టేడియంలో ఉత్సాహాన్ని పెంచేలా ప్లాన్ చేశారు. క్రికెట్ స్టేడియంలో ప్రేక్షకుల హుషారు మ్యాచ్ మొత్తానికి కొనసాగేందుకు ఇది మంచి ఆలోచనగా బీసీసీఐ భావిస్తోంది. సంగీతంతో స్టేడియం మార్మోగితే మ్యాచ్ మరింత ఉత్కంఠగా సాగుతుందని లెక్కగడుతున్నారు.
200 ప్లస్ స్కోర్ల హవా – ఇంపాక్ట్ ప్లేయర్ల ప్రదర్శన
ఈ సీజన్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. సన్‌రైజర్స్, కోల్‌కతా, పంజాబ్, రాజస్థాన్ టీమ్స్ 200 పైగా పరుగులు చేయడంతో హై స్కోరింగ్ మ్యాచులు దుమ్మురేపుతున్నాయి. మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్స్ అద్భుత ప్రదర్శనతో జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటిదాకా ఈ ఐపీఎల్‌లో టాప్ ఫార్మాట్ కొనసాగుతోంది. మరి SRH vs LSJ మ్యాచ్‌లో ఏ బ్యాటర్ విరుచుకుపడతాడు? ఏ బౌలర్ మ్యాచును తిప్పి పడేస్తాడు? – అనే ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది. మ్యాచ్, మ్యూజిక్ కలిసిన ఈ వినోదం మిస్ అవ్వకండి!