ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ దేశంలో ప్రముఖ రాజకీయ నాయకురాలుగా ఎదగడానికి అత్యంత ప్రభావశీల కారణం బంధుప్రీతి అని వ్యాఖ్యానించారు. “ఎమర్జెన్సీ” సినిమా ప్రమోషన్స్ సమయంలో కంగనా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు

కంగనా మాట్లాడుతూ, “ఇందిరా గాంధీ కుటుంబం చాలా పేరున్న కుటుంబం. ఆమె జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె, దీని ద్వారా ఆమెకు రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం కలిగింది. ఆమెకు ఉన్న కుటుంబ నేపథ్యం వల్లే ఆమెను ప్రజలు ఆదరించారు. ఆమె తన రాజకీయ వృత్తిలో అద్భుతమైన ప్రాభవం చూపించారు” అని అన్నారు.
ఇందిరాగాంధీ గురించి కంగనా చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆమె కుటుంబ నేపథ్యం ఒక ప్రధాన కారణం. అందుకే ఆమె రాజకీయాల్లో కీలక పాత్ర పోషించగలిగింది” అని కంగన పేర్కొన్నారు.
ఇందిరాగాంధీ రాజకీయ జీవితంలో ముఖ్యమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. ఆమెకు ఉన్న ప్రముఖ కుటుంబ నేపథ్యం వాటికి ఆధారంగా మద్దతు పలికింది. “ఆమెను ప్రభావితం చేసే చాలా అంశాలు ఉన్నాయి. వాటిలో బంధుప్రీతి కూడా ఒకటి. అందుకే ఆమెకు రాజకీయాల్లో శకి్తమంతురాలిగా ఎదిగారని కంగనా పేర్కొన్నారు.












