భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం వచ్చిన రెండు రోజులకు, జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా కొనసాగిందని భారత సైన్యం ప్రకటించింది. అయితే, శాంతి స్థిరపడక ముందే పాకిస్తాన్ మరోసారి కుట్రబుద్ధిని బయటపెట్టి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పహల్గామ్ ఉగ్రదాడి (ఏప్రిల్ 22) తర్వాత నాలుగు రోజుల పాటు భీకర కాల్పుల తరువాత శనివారం సాయంత్రం రెండు దేశాలు కాల్పుల విరమణపై అంగీకరించాయి. కానీ ఆ తర్వాత కూడా పాక్ డ్రోన్ల ద్వారా దాడుల యత్నాలు చేసినట్టు భారత అధికారులు పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సైన్యానికి “బుల్లెట్ వస్తే మిస్సైల్ వదలండి” అంటూ సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు. ఈ కఠిన హామీతో పాక్ తక్షణమే వెనక్కి తగ్గినట్టు సమాచారం. భూమి, వాయు, సముద్ర మార్గాలపై కూడా అన్ని రకాల సైనిక చర్యలు నిలిపివేయాలని అంగీకారం వచ్చినా, పాక్ డ్రోన్లు శ్రీనగర్, గుజరాత్ మరియు జమ్మూ ప్రాంతాల్లో చొరబాటుకు యత్నించాయి.
భారత్ వెంటనే స్పందిస్తూ డ్రోన్లను అడ్డుకుంది. రాత్రిపూట జరిగిన మీడియా సమావేశంలో భారత సైన్యం, కాల్పుల విరమణ ఉల్లంఘనపై తగిన ప్రతిస్పందన జరగిందని స్పష్టం చేసింది. అనంతరం ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడితో మాట్లాడి పాక్‌పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచారు.
ఈ నెల 7న భారత ప్రభుత్వం “ఆపరేషన్ సిందూర్” పేరుతో PoK లోని 9 ఉగ్ర స్థావరాలపై లక్ష్య దాడులు జరిపింది. ఈ చర్యలతో పాక్ పూర్తిగా సైలెంట్ అయింది. ఉగ్రవాద దాడులపై భారత్ ఇక ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుందో స్పష్టంగా చూపింది.