IND vs AUS 3వ టెస్ట్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేసి తన టెస్ట్ కెరీర్‌లో 22వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో జడేజా ఈ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ (77 పరుగులు) ఆడాడు. రోహిత్ శర్మ అవుటైన తర్వాత, జడేజా బ్యాటింగ్‌కు దిగి, రాహుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒకవైపు రాహుల్ 86 పరుగులు చేసి ఔట్ అయినా జడేజా క్రీజులో ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. 2017 నుండి జడేజా టెస్టుల్లో 7వ లేదా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అత్యధిక 50+ స్కోర్లు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ ఫిఫ్టీ ప్లస్ స్కోర్, 75 కంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్న ప్రపంచ క్రికెట్‌లో మూడవ క్రికెటర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో విల్‌ఫ్రెడ్ రోడ్స్, ఇయాన్ బోథమ్ ఇలాంటి ఘనత సాధించారు. జడేజా ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై మొత్తం 89 వికెట్లు పడగొట్టాడు. 6 ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేయడంలో విజయం సాధించాడు.
ఇంగ్లండ్ ఆటగాడు విల్‌ఫ్రెడ్ రోడ్స్ ఆస్ట్రేలియాపై టెస్టులో 10 ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేయగా, 109 వికెట్లు తీయడంలో విజయం సాధించాడు. ఇది కాకుండా, ఇయాన్ బోథమ్ ఆస్ట్రేలియాపై 10 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేశాడు. ఆస్ట్రేలియాపై 148 వికెట్లు తీయడంలో కూడా విజయం సాధించాడు.
గబ్బా టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. కానీ కేఎల్ రాహుల్ 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ 152 పరుగులు, స్టీవ్ స్మిత్ 101 పరుగులు చేశారు.