హైడ్రా ఈ పదం వింటే బఫర్ జోన్ లో నివాసం ఉండే వారికీ నిద్ర కూడ పట్టదు. ఎందుకంటే ఎపుడు వచ్చి ఇల్లు కూలగొడతారో తెలియని పరిస్థితి. గత రెండు నెలలుగా అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్న హైడ్రా తెలంగాణ హై కోర్ట్ వేసిన మొట్టికాయలతో కొంత కాలంగా కూల్చివెతలు చేయడం లేదు. పేదల ఇళ్లను కూల్చివేసి పెద్దల ఇళ్లను నోటీసు ఇచ్చి వదిలి వేస్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. కోర్ట్ కూడ ఇదే విషయాన్ని చెప్పింది. చట్టంలో ఉన్న ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్లాలని చెప్పింది. దింతో కూల్చివేతలు కొంత కాలం విరామం ఇచ్చారు. ప్రభుత్వం కూడ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈలోగా విధివిధానాలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. బెంగుళూరు సిటీ లో చెరువుల పరిరక్షణకు ఎలాంటి చట్టం అమలు చేస్తున్నారు. ఈ విషయాలను తెలుసుకునేందుకు ఒక బృందం వెళ్ళింది. Hydra works re start in Hyderabad
అయితే హైదరాబాద్ సిటీలో నాళాలు, పార్కులు, ఫుట్ పాత్ ల మీద ఉన్న ఆక్రమణలును తొలగించేందుకు సిద్ధం అయ్యారు. ముందుగా వారికీ చట్టం ప్రకారం నోటీసు ఇచ్చి ఆ తరువాత ప్లాన్ అఫ్ యాక్షన్ లోకి దిగాలని చుస్తున్నారు. ఈ విధంగా ఆక్రమించుకున్న వారికీ ఇప్పటికే నోటీసు జారీ చేశారని తెలుస్తుంది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసు లో పేర్కొన్నారు అని తెలుస్తుంది. అయితే నోటీసు అందుకున్న వారి నుంచి వచ్చే జవాబును బట్టి తమ కార్యాచరణ ఉంటుందని హైడ్రా అధికారులు పేర్కొన్నట్టు సమాచారం.