హైదరాబాద్ వాతావరణ మార్పులు : ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ వాతావరణంలో తీవ్రమైన మార్పులు జరుగనున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకకాలంలో ఎండ, మేఘావృతమైన వర్షాలు మరియు చలికాలం వంటి పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఈ వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌లో సాధారణంగా సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంటాయి. అయితే, ఇటీవల జనవరి నెల మధ్య నుంచి ఈ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఉదాహరణకు, జనవరిలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. ఏప్రిల్ నాటికి ఉష్ణోగ్రతలు 36-34 డిగ్రీల మధ్య చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
గత 5 సంవత్సరాలతో పోలిస్తే, ఈసారి ఫిబ్రవరిలో వాతావరణ మార్పులు క్లిష్టంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జనవరిలో సాధారణంగా ఉష్ణోగ్రతలు 15.6°C నుండి 28.5°C మధ్య ఉంటాయి. కానీ 2022లో జనవరిలో 12°C, 2020లో 11°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2015లో మాత్రం 34°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ సంవత్సరం వాతావరణ మార్పులు ప్రకృతిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ముఖ్యంగా, హైదరాబాదులో తీవ్ర వేడిగాలులు మరియు వర్షాలు కనిపించవచ్చు. వాతావరణ మార్పుల వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడవచ్చని, తద్వారా కాలుష్యం ఎక్కువ అవుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రజలలో శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువ అవడానికి కారణం అవుతుంది.
ఫిబ్రవరి 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వాతావరణ సంచాలకులు నాగరత్నమ్మ తెలిపారు. ఆమె ప్రకారం, ఒక్కోసారి చల్లగాలులు, మరొకసారి వేడిగాలులు వీస్తాయని చెప్పారు. ఫిబ్రవరి 15 తర్వాత వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉందని, నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.