ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించిన తర్వాత, కొత్త వేరియంట్లు మరింత భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, భారత్‌లో మరో కరోనా వేరియంట్ HKU1 నిర్ధారణ కావడం కలవరం రేపుతోంది.
HKU1 భారత్‌లో తొలి కేసు
కోల్‌కతాలో 45 ఏళ్ల మహిళకు హ్యూమన్ కరోనావైరస్ HKU1 సోమవారం నిర్ధారణ అయ్యింది. ఆమె గత 15 రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

హ్యూమన్ కరోనావైరస్ HKU1 అంటే ఏమిటి?
HKU1 వైరస్ బీటా కరోనా వైరస్ హాంకానెన్స్ (Beta Coronavirus HKU1) కుటుంబానికి చెందింది. ఇది ప్రధానంగా తేలికపాటి నుండి మితమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. ఈ వైరస్‌కు ప్రత్యేక చికిత్స లేదా వ్యాక్సిన్ లేవు. ఇది ప్రధానంగా 229E, NL63, OC34 వంటి ఇతర సాధారణ కరోనా వైరస్‌ల వలే ఉంటుంది.
HKU1 లక్షణాలు
- ముక్కు కారటం
- గొంతు నొప్పి
- తలనొప్పి
- జ్వరం
- దగ్గు
- తీవ్రమైన సందర్భాల్లో న్యుమోనియా లేదా బ్రోన్కైటిస్ కారణమవుతుంది
ఈ వైరస్ వల్ల ఎక్కువ ప్రమాదంలో ఉన్నవారు
- హృదయ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు
- రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు
- శిశువులు మరియు వృద్ధులు (కొమొర్బిడిటీలు ఉన్నవారు)
HKU1 వ్యాప్తిని ఎలా నివారించాలి?
COVID-19 సమయంలో పాటించిన జాగ్రత్తలు HKU1 నివారణకు కూడా సహాయపడతాయి:
✅ చేతులను సబ్బు, నీటితో కనీసం 20 సెకన్లు కడుక్కోవాలి
✅ ముక్కు, నోటిని తాకే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి
✅ అనారోగ్యంతో ఉన్నవారితో సన్నిహిత సంబంధాన్ని నివారించాలి
✅ దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు రుమాలు లేదా మడతపెట్టిన భుజం ఉపయోగించాలి
✅ సాధారణ వస్తువులు, ఉపరితలాలను శుభ్రపరచాలి
✅ ఎక్కువగా నీళ్లు తాగాలి, పండ్ల రసాలు తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి
టీకా ఉందా?
ప్రస్తుతం HKU1 కోసం ప్రత్యేకమైన టీకా లేదు. అయితే, సాధారణంగా వైరస్ సంక్రమించిన వ్యక్తులు స్వయంగా కోలుకుంటారు. ఆరోగ్య నిపుణులు నిత్యం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, పోషకాహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.