బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇప్పుడు మంచి సమయమనే చెప్పాలి. ఎందుకంటే గత నాలుగు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటితో పోల్చితే ఈరోజు బంగారం ధర మరింత తక్కువగా ఉంది. ప్రస్తుతానికి 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.9,550, 22 క్యారెట్ల ధర రూ.8,754, మరియు 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.7,163గా ఉంది.

ఈ ధరల తగ్గుదలకి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావమే. డాలర్ బలపడడం, స్టాక్ మార్కెట్లలో వృద్ధి వంటి అంశాలు కూడా బంగారం ధరలను తగ్గించాయి.
దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం: 22K – ₹87,540, 24K – ₹95,500
- ముంబై, బెంగళూరు, చెన్నై: 22K – ₹87,540, 24K – ₹95,500
- ఢిల్లీ: 22K – ₹87,690, 24K – ₹95,650
ఇక వెండి విషయానికొస్తే, దీని ధర కూడా పెరుగుతోంది. పారిశ్రామిక అవసరాలకు వినియోగం పెరగడంతో డిమాండ్ ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వెండి ధర గ్రాముకు ₹108.90, కిలో ధర ₹1,08,900గా ఉంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి:
- హైదరాబాద్: ₹1,08,900/కిలో
- విజయవాడ, విశాఖపట్నం: ₹1,08,000/కిలో
- ముంబై, ఢిల్లీ, బెంగళూరు: ₹97,900/కిలో
- చెన్నై: ₹1,08,000/కిలో
ఈ రేట్లు ఉదయం 6 గంటలకు నమోదు అయినవని గమనించాలి.