బాబోయ్ బంగారం! ఈ పేరు వినగానే సామాన్యులకు షాక్ తగులుతున్న రోజులివి. బంగారం ఇప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా మారడంతో, ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరలు స్థిరంగా లేకుండా ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. 2014 చివర్లో ధరలు తగ్గిన తర్వాత భారీ డిమాండ్ పెరిగింది.
ఈరోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు ₹9,192, 22 క్యారెట్ల బంగారం ధర ₹8,426, 18 క్యారెట్ల ధర ₹6,895 గా ఉంది. వెండికి కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా దేశంలోని ముఖ్య నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం తాజా ధరలు (10 గ్రాములకు)
- హైదరాబాద్: 22 క్యారెట్ల – ₹84,260 | 24 క్యారెట్ల – ₹91,920
- విశాఖపట్నం, విజయవాడ: 22 క్యారెట్ల – ₹84,260 | 24 క్యారెట్ల – ₹91,920
- ఢిల్లీ: 22 క్యారెట్ల – ₹84,410 | 24 క్యారెట్ల – ₹92,070
- ముంబై: 22 క్యారెట్ల – ₹84,260 | 24 క్యారెట్ల – ₹91,920
- చెన్నై: 22 క్యారెట్ల – ₹83,410 | 24 క్యారెట్ల – ₹90,990
- బెంగళూరు: 22 క్యారెట్ల – ₹84,260 | 24 క్యారెట్ల – ₹91,920
వెండి తాజా ధరలు (1 కిలోకు)
- హైదరాబాద్: ₹1,12,900
- విజయవాడ, విశాఖపట్నం: ₹1,14,100
- ఢిల్లీ, ముంబై, బెంగళూరు: ₹1,03,900
- చెన్నై: ₹1,12,900
ఈ ధరలు ఉదయం 8 గంటలలోపు నమోదైనవి. బంగారం, వెండి ధరల తాజా అప్‌డేట్ తెలుసుకోవాలంటే 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.












