గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌పై అభిమానుల్లో భారీ స్పందన వచ్చింది. జనవరి 2న విడుదలైన ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వేమగిరిలో జనవరి 4న ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్ ఏర్పాట్లను అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవనం స్వామి నాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

40 ఎకరాల విస్తీర్ణంలో జరుగనున్న ఈ ఈవెంట్‌కు రామ్ చరణ్‌తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ కార్యక్రమం మెగా ఫ్యాన్స్‌తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు, ఫ్యాన్స్ సుమారు లక్ష మంది పైగా ఈ వేడుకకు హాజరు కానున్నారని అంచనా వేస్తున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలో భారీ కేట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, సభలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
ఈ ఈవెంట్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమా మరింత పాపులారిటీ సాధించి, సినీ పరిశ్రమలోనే గొప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌గా రికార్డు సృష్టించనుందని నిర్వాహకులు వెల్లడించారు.












