అప్పుడెప్పుడో దాదాపు 5 సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన గేమ్ చెంజర్ సినిమా ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మధ్యలో దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షూటింగ్ కోసం వెళ్లిపోవడంతో గేమ్ చెంజర్ సినిమా మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. మధ్యలో రెండు వేవ్ ల కొరోనా రావడంతో షూటింగ్ నిలిపివేశారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి గత సంవత్సరం పుట్టినరోజున ఫస్ట్ లుక్, ఈ సంవత్సరం పుట్టిన రోజున జరుగండి అనే సాంగ్, ఇప్పుడు రా మచ్చ మచ్చ అనే సాంగ్ మినహా ఇతర అప్డేట్ లు రాలేదు. దింతో రామ్ చరణ్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సినిమా యూనిట్ ని ట్రోల్ల్స్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. కానీ యూనిట్ నుంచి మాత్రం టీజర్ కి సంబంధించి అప్ డేట్ లేదు. దింతో అభిమానులు ఈ చిత్రం పై ఆశలు వదులుకున్నారు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు శంకర్. ఈ స్టార్ డైరెక్టర్ గత సినిమా భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ ఐంది. అవుట్ డేటెడ్ స్టోరీ తో తీసిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ ఐంది. దీనికి తోడు భారతీయుడు 3 కూడ త్వరలో రాబోతుంది. అయితే గేమ్ చెంజర్ కూడ 5 ఏళ్ల క్రితం మొదలు ఐంది. ఆ తరువాత కొరోనా రావడంతో ప్రేక్షకుల అభిరుచి, మైండ్ సెట్ మారిపోయింది. ottలోనే కావాల్సిన థ్రిల్లర్, సరికొత్త జోనర్లలో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కావున పాత కాలం నాటి కథతో వస్తే ప్రేక్షకులు డిజాస్టర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే భయం ఇటు
అభిమానులతో పాటు సినిమా యూనిట్ వారికీ కలవరపెడుతుంది. దింతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. అందుకే సినిమా ఆలస్యం అవుతుంది. కానీ సినిమా బడ్జెట్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. స్టార్ ప్రొడ్యూసర్ ఐన దిల్ రాజు కూడ జీ స్టూడియోస్ వారితో భాగస్వామ్యం అయ్యారు. మొన్న విడుదల ఐన సాంగ్ చూస్తే సాంగ్ ఎంత గ్రాండియర్ గా ఉందొ తెలుస్తుంది. శంకర్ పెట్టించే బడ్జెట్ కి లిమిట్ లేదు. ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో సినిమాలో సాంగ్ లేకపోయినా సూపర్ హిట్ ఐన సందర్భాలు చాలా ఉన్నాయి. కల్కి లో కేవలం ఒక పాట మాత్రమే ఉంది. సత్యం సుందరం సినిమాలో ఒక పాట మాత్రమే ఉంది. దేవర లో కూడ కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయి. కానీ శంకట్ మాత్రం కోట్లకు కోట్లు పెట్టి సాంగ్ తీసున్నారు. ఒక వేళ సినిమా ప్లాప్ అయితే పెట్టిన ఖర్చు మొత్తం వృధ అవుతుంది. ఈ కాలంలో పాటల కోసం ఎవరు థియేటర్లకి రావడం లేదు. సినిమాకి హిట్ టాక్ వస్తేనే వస్తున్నారు. సినిమా ఫ్లో కి పాట అడ్డం వస్తే ఫలపు అయిన సినిమాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా గురించి అభిమానులను అడిగితే ఆ విడుదల అయినప్పుడు చూద్దాం లే అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా బడ్జెట్ కి లిమిట్ లేదు. దిల్ రాజు కి విడుదల అయ్యే వరకు మనశాంతి లేదు, శంకర్ కి డబ్బులు మొత్తం ఖర్చు పెట్టించేదాకా నిద్ర లేదు. ఈ విధంగా గేమ్ ఛంజర్ సినిమా పరిస్థితి. కనీసం ఫస్ట్ లుక్ టీజర్, టీజర్ లాంటివి విడుదల చేస్తే ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు. బిజినెస్ స్ట్రాటజీ రాజమౌళిని చూసి నేర్చుకోవాలి.
1 thought on “గేమ్ చెంజర్ మూవీపై హైప్ రాకపోవడానికి కారణం అదేనా?”