హైదరాబాద్: సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయిన పల్లి లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు కథనం ప్రకారం హస్మత్ పేట్ అంబేద్కర్ స్టాట్యూ సమీపంలోని ఆల్ స్పైసీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కుక్ గ్యాస్ సిలిండర్ ను రోడ్డుపైకి విసిరికొట్టాడు. సిలిండర్ గ్లాస్ డోర్ కు తగిలి కుక్ తోపాటు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని మరికొంత మంది గాయపడ్డాడు. స్థానికులు నిలువ ఉన్న గ్యాస్ సిలిండర్లను తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ ఇంజన్ వచ్చే లోపు స్థానికులు సహాయంతో మంటలార్పివేశారు. గాయపడ్డవారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. బోయినపల్లి,అల్వాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
స్థానికుల చొరవతో తప్పిన పెను ప్రమాదం
ప్రమాదం జరిగిన ప్రదేశంలో సిలిండర్లు ఉండటంతో స్థానికులు అప్రమత్తమై బయటికి తీసుకొని రావాదంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎవరికి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.