• Home
  • health
  • గుడ్డులోని పచ్చసొనను పక్కన పెట్టేస్తున్నారా?..గుడ్డులోని పచ్చ సొన ఆరోగ్య ప్రయోజనాలు….
Image

గుడ్డులోని పచ్చసొనను పక్కన పెట్టేస్తున్నారా?..గుడ్డులోని పచ్చ సొన ఆరోగ్య ప్రయోజనాలు….

పోషకాల పవర్ హౌస్… కోడిగుడ్డు అంటారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే చాలు… మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయని చెబుతున్నారు. ఇది ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ D, ఇనుము, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

అలాంటిది గుడ్డులోని పచ్చ సొనను కొందరు బయట పడేస్తుంటారు. కేవలం తెల్లసొన మాత్రమే తింటుంటారు. కానీ నిజానికి మనం తినాల్సింది పచ్చ సొననే అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం.

గుడ్డులోని పచ్చ సొన పోషకాల గని

పచ్చ సొనలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ A అధికంగా ఉంటుంది. ఇది రెటినోల్ రూపంలో దొరుకుతుంది. మన కళ్లలోని రెటీనాకు ఇది చాలా అవసరం. రేచీకటి రాకుండా అడ్డుకుంటుంది. వయసు పెరుగుతుంటే వచ్చే అంధత్వం రాకుండా రక్షిస్తుంది.

పచ్చ సొనలో విటమిన్ K కూడా అధికంగా ఉంటుంది. గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టడం చాలా అవసరం. లేకుంటే అధిక రక్తస్రావమై ప్రాణాపాయం కలుగుతుంది. ఈ విధంగా గాయాల నుంచి రక్తాన్ని ఆపే శక్తి విటమిన్ K కు ఉంది.

గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ D కూడా ఉంటుంది. ఇది ఆస్టియోపొరాసిస్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. అలాగే, ఇందులో విటమిన్ E కూడా మెరుగ్గా ఉంటుంది. దీన్ని తినడం వల్ల చర్మానికి ఎలాంటి నష్టాలు రావు. చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మంపై ముడతలు పడడం, మొటిమలు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి.

గుడ్డులోని పచ్చ సొనలోని బి విటమిన్లు మన శరీరానికి అత్యవసరమైనవి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి.

Summary:
గుడ్డులోని పచ్చ సొన పోషకాహార నిపుణుల ప్రకారం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ A, K, D, E, మరియు బి విటమిన్లు, అవి కళ్ల ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, రక్త గడ్డ కట్టడం, మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ముఖ్యమైనవి. కొలెస్ట్రాల్ భయంతో పచ్చ సొనను విడిచిపెట్టడం అనవసరం.

Releated Posts

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు: గుండె, చర్మం, జీర్ణవ్యవస్థకు ఆహార సొంపులు!

డ్రాగన్ ఫ్రూట్ అనేది పోషక విలువలతో నిండిన ఆరోగ్యపరమైన పండు. ఇందులో కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.…

ByByVedika TeamMay 7, 2025

నెలరోజుల పాటు టీ తాగకపోతే శరీరంలో జరిగే అద్భుత మార్పులు!

మన దేశంలో టీ ప్రియులు ఎందరో ఉన్నారు. రోజు టీ తాగకపోతే పని మొదలయ్యేలా ఉండదనే స్థాయికి అలవాటు అయిపోయారు. అయితే ఆరోగ్య నిపుణుల…

ByByVedika TeamMay 5, 2025

వేసవిలో బెల్లం నీళ్లు తాగితే కలిగే అద్భుత లాభాలు – శరీరాన్ని చల్లగా ఉంచే సహజ మంత్రం!

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసిపోతుంది. అలాంటి సమయాల్లో బెల్లం నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. బెల్లంలో ఉన్న…

ByByVedika TeamMay 2, 2025

ప్రతిరోజూ ఎంత చక్కెర తినాలో తెలుసా? WHO సూచనలు తప్పనిసరిగా తెలుసుకోండి!

ఈ రోజుల్లో అధికంగా చక్కెర తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఊబకాయం, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్ వంటి…

ByByVedika TeamMay 1, 2025

Leave a Reply