భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో, పార్లమెంట్లో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా, రాష్ట్రపతి ముర్ము అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో రైతులు, సైనికులు, సైన్స్, మరియు పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మారుస్తామని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ. 50,000 కోట్లు కేటాయించి, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించామని చెప్పారు. అలాగే, ప్రభుత్వం మధ్యతరగతి గృహాలు, గిరిజన సంక్షేమంపై కూడా దృష్టి సారించిందని, చిన్న వ్యాపారాలకు రెట్టింపు రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు.

మహాకుంభ్‌లో జరుగుతున్న ఉత్సవాన్ని మరియు మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం పట్ల తన సంతాపాన్ని తెలియజేస్తూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. భారత్‌లో నిర్మించిన గగన్‌యాన్, స్పేస్ డాకింగ్‌లో విజయాలు భారతదేశం తన స్వంత స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేసేందుకు మార్గం సులభతరం చేసినాయని అన్నారు.
సర్కార్ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నదని, 13 భారతీయ భాషల్లో రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించడం వల్ల భాషా సంబంధిత అడ్డంకులు తొలగిస్తామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా అందించాలని నిర్ణయించారు.
ప్రభుత్వం యువతకు విద్య, ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తోందని, మధ్యతరగతి ప్రజల కోసం తీసుకునే చర్యలను అభినందనీయంగా అభివర్ణించారు. మోదీ మూడో టర్మ్‌లో దేశం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, ప్రస్తుతం 3 రెట్లు వేగంగా పనులు సాగుతున్నాయని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.