ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: గెలుపెవరిది?
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు గట్టి పోటీ పెడుతున్నాయి. కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడతారా? లేక బీజేపీ విజయదుందుభి మోగిస్తుందా? కాంగ్రెస్ ఈసారి సత్తా చూపించగలదా? అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. అయితే పోలింగ్ శాతం కారణంగా పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది.
క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతోన్న ఎన్నికల ఫలితాల్లో కీలక అభ్యర్థుల స్థితిగతులు ఇలా ఉన్నాయి:

- కల్కాజీ: బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి 1,635 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సీఎం అతిషి వెనుకబడి ఉన్నారు.
- గ్రేటర్ కైలాష్: సౌరభ్ భరద్వాజ్ 2,721 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ కంటే వెనుకబడి ఉన్నారు.
- బాబర్పూర్: గోపాల్ రాయ్ 20,750 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అనిల్ వశిష్ట రెండవ స్థానంలో ఉన్నారు.
- బల్లిమారన్: ఇమ్రాన్ హుస్సేన్ 15,302 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కమల్ బాగ్రీ రెండవ స్థానంలో ఉన్నారు.
- సుల్తాన్పూర్ మజ్రా: ముఖేష్ అహ్లావత్ 6,872 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కరం సింగ్ రెండవ స్థానంలో ఉన్నారు.
- నంగ్లోయ్ జాట్: రాఘవేంద్ర షౌకీన్ 10,765 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ షౌకీన్ ముందంజలో ఉన్నారు.
ఈ ఫలితాలు తుది విజేతను నిర్ణయించబోతున్నాయి. మరి చివరికి ఢిల్లీలో ఏ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందో చూడాలి!