డాకు మహారాజ్ సినిమా, ఈ ఏడాది సంక్రాంతి పండగ కోసం విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసింది.
అయితే, తిరుపతిలో జరిగిన దారుణ ఘటన కారణంగా, ఈ ఈవెంట్ రద్దు చేయడం జరిగిందని చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించారు. ఈ ఘటనతో, మేకర్స్ తమ సినిమా వేడుకను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

“తిరుపతిలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని, మా ఈవెంట్ రద్దు చేస్తున్నాం. ఈ సమయంలో భక్తుల పట్ల మేము గౌరవం ప్రదర్శిస్తాం. అందరికి అర్థం అవుతుందని ఆశిస్తున్నాం,” అని వారు తెలిపారు.
ఈ రోజు అనుకున్న ఈవెంట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కానీ, ఈ దురదృష్టకర సంఘటన తర్వాత, ఈవెంట్‌ని నిర్వహించేందుకు అది సరైన సమయం కాదు అని చిత్ర యూనిట్ పేర్కొంది.