Vedika Media

Vedika Media

vedika logo

బెదిరిస్తున్న పాక్ క్రికెట్ బోర్డు…. డైలమాలో ఛాంపియన్స్ ట్రోఫీ?

వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయా? పాక్ క్రికెట్ బోర్డు ఏమి చేయబోతుంది? భారత్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లకపోతే అంత నష్టం వచ్చే అవకాశం ఉంది? అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్ బోర్డు నోట్లో పచ్చి ఏలక్కాయ పడ్డట్టు అయిందా ? Cricket Champions Trophy Will Cancel?

ICC Champions trophy 2025

వచ్చే ఫిబ్రవరి లో మొదలు అయ్యే చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ క్రికెట్ జట్టు పాక్ గడ్డపై అడుగు పెట్టె పరిస్థితి లేదు. ఎందుకంటే భారత్ పాకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగడం లేదు. కేవలం ఐసిసి ఈవెంట్లలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. కానీ ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాక్ బోర్డు దక్కించుకుంది. స్టేడియాల డెవలప్మెంట్ కోసం భారీగా ఖర్చు చేస్తుంది. అసలే అప్పుల ఊబిలో పాక్ క్రికెట్  బోర్డు కొట్టుమిట్టాడుతుంది. కనీసం ఆటగాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ టోర్నీ పై భారి అసలు పెట్టుకుంది. కానీ వారి ఆశలపై భారత్ జట్టు నీళ్ళు చల్లింది. ఎందుకంటే ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే హై వోల్టేజ్ తో కూడుకున్నది. టికెట్ రేట్స్ ఆకాశాన్ని తాకుతాయి అయిన కూడ కొనుక్కొని చూసే వారి సంఖ్య లక్షల్లో ఉంటారు. ఇంకా చెప్పాలంటే భారత్ ఫాన్స్ పాకిస్థాన్ కి వెళ్ళి చూడటం వల్ల వారికి టూరిజం ద్వారా భారీగా డబ్బు వస్తుంది. అందుకంటే పాక్ బోర్డు ఇండియా పాకిస్థాన్ వచ్చి మ్యాచ్ ఆడాలని కోరుకుంటుంది. కానీ బిసిసిఐ మాత్రం ఆట కంటే మా ఆటగాళ్ల భద్రత మాకు ముఖ్యం అనే వాదన వినిపిస్తుంది. ఈ విషయంలో ఐసిసి కూడ చేతులు ఎత్తేసినట్టు తెలుస్తుంది. బిసిసిఐ మాత్రం హైబ్రిడ్ మోడల్ లో అయితే మేము అడుతాము అనే ప్రతిపాదన తెచ్చింది.
ICC Champions trophy 2025

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, రెండు జట్లు ICC లేదా ACC పోటీలలో మాత్రమే పోటీ పడ్డాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ఈ సారి కూడ ఇరు జట్ల మధ్య పోటీ ఉండదు. దీనికి కారణం ఛాంపియన్స్ ట్రోఫీపై నెలకొన్న వివాదమే.. ఇప్పుడు అది ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు భారత క్రికెట్ బోర్డు నిరాకరించడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ మీడియా కథనాల ప్రకారం, భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లకపోతే, రాబోయే ఏ టోర్నీలో కూడా పాకిస్తాన్ భారత్‌తో ఆడదు అనే సంకేతాలు ఇస్తుంది. 

వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ కప్ జరగాల్సి ఉంది. అయితే, భారత జట్టు  పాక్ కి వెళ్తుందా ? లేదా అనే దానిపై మొదటి నుంచీ అనుమానాలు ఉన్నాయి. గత 16-17 ఏళ్లలో భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును పంపేందుకు భారత ప్రభుత్వం నిరాకరించిందని బీసీసీఐ ఇటీవల ఐసీసీకి ఇమెయిల్ ద్వారా సమాచారం అందించింది. ఇప్పుడు భారత ICC ప్రతినిధి బృందం ఈ స్థానానికి ఇమెయిల్ ద్వారా పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి తెలియజేసింది. 

ICC Champions trophy 2025           

నవంబర్ 10, ఆదివారం, భారత క్రికెట్ బోర్డు నిర్ణయం గురించి ఐసిసి నుండి సమాచారం అందిందని పిసిబి తెలిపింది. ఈమెయిల్‌ను ఐసీసీ పాక్ ప్రభుత్వానికి పంపిందని, ప్రభుత్వ సలహా కోరినట్లు పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంపై పాక్ ప్రభుత్వం ఇంకేమీ మాట్లాడలేదు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు స్థానిక మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పాకిస్థానీ జర్నలిస్ట్ ఫైజాన్ లఖానీ ‘X’ కథనంలో భారత జట్టును పాకిస్తాన్‌కు పంపే వరకు ఆ జట్టు రాబోయే ఏ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించదని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది. ఈ టోర్నీలోని నాకౌట్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడితే, ఆ గేమ్‌లో కూడా పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టు నిరాకరిస్తుంది.

 

Leave a Comment

Vedika Media