• Home
  • Spiritual
  • చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన సంచలనం…!!
Image

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన సంచలనం…!!

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన ఇంట్లో ఉన్న సమయంలో 20 మంది వ్యక్తులు తనపై దాడి చేశారని రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ దాడిలో పాల్గొన్నవారిలో వీర రాఘవ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.

రామరాజ్యం కోసం సైన్యాన్ని తయారు చేయాలని ఒత్తిడి

రంగరాజన్‌పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ఇంటికి వచ్చిన వ్యక్తులు రామరాజ్యం కోసం సైన్యాన్ని తయారు చేయాలని” తనను ఒత్తిడి చేశారని రంగరాజన్ వెల్లడించారు. అయితే, ఇందుకు తన సహకారం అందించనని చెప్పినందుకు వారు తనపై దాడి చేసినట్లు ఆయన తెలిపారు.

తాను రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తానని, ఎవరి ఒత్తిడికి కూడా లోనుకానని స్పష్టం చేసినందుకు దాడి జరిగినట్లు రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రంగరాజన్‌ను తమ సంస్థలో చేరాలని బెదిరింపులు

ఈ దాడి ఘటన శుక్రవారం జరిగింది. రామరాజ్యం సంస్థ” కు చెందిన కొంతమంది వ్యక్తులు రంగరాజన్‌ను బెదిరించి, ఆలయ బాధ్యతలను వదిలి తమ సంస్థలో చేరాలని ఒత్తిడి చేశారని సమాచారం. ఈ విషయంపై రంగరాజన్ తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 7వ తేదీన ఈ దాడి జరగ్గా, ఇది రెండు రోజుల తర్వాత బయటకు రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్  x లో స్పందించారు. “ధర్మరక్షకులపై దాడులు జరుగుతాయి… రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు” అంటూ కామెంట్ చేశారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా, హోం మంత్రి, ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనపై హిందూ ధర్మ పరిరక్షకులు స్పందించకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరగడంతో భక్తులు, హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిని అందరూ ఖండిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తుండగా, నిందితుల అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా పని చేస్తున్నాయి.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply