బంగ్లాదేశ్‌లో మరో ఆలయంపై దాడి
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాకాండ ఇప్పట్లో ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఒక ఇస్కాన్ సెంటర్‌కు నిప్పు పెట్టారు. అక్కడి లక్ష్మీనారాయణ విగ్రహానికి నిప్పంటించారని సమాచారం. ఆలయంలోని వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఆలయంపైనా దాడి జరిగింది. నమ్‌హట్టాలోని ఇస్కాన్ సెంటర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. హిందూ దేవాలయాలే లక్ష్యంగా ఛాందసవాదులు ఈ దాడులకు పాల్పడుతున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పాలనలో అక్కడి మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. … Read more