Vedika Media

Vedika Media

vedika logo

పుష్ప సినిమాపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు

తెలంగాణ మంత్రి సీతక్క హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాకు జాతీయ అవార్డు లభించడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఎర్రచందనం దొంగలకు జాతీయ అవార్డు ఇవ్వడం ఏమిటి?” అని ప్రశ్నించారు. “జై భీమ్” లాంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదని, కానీ పోలీసులను అవమానించే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “మానవ హక్కులను కాపాడే లాయర్‌ను జీరోగా చూపిస్తూ, స్మగ్లర్‌ను హీరోగా చిత్రీకరించడం సరికాదు” అని మండిపడ్డారు.

“సినిమాలో స్మగ్లర్ హీరో అయితే, స్మగ్లింగ్‌ను అరికట్టే పోలీసు విలన్ ఎలా అవుతాడు?” అని ప్రశ్నిస్తూ, ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తులను ప్రోత్సహిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్ అయినా, ప్రజలకు మంచి సందేశాలు ఇవ్వాలి. సినిమా నటులు, నిర్మాతలు, దర్శకులు సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలతో సినిమాలు తీయాలి అని సీతక్క అన్నారు.

డిసెంబర్ 21, 2024 అంటే ,ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకే రాత్రి మొదలవుతుందా?

యువర్ అటెన్షన్ ప్లీజ్..! మీకు శనివారం ఎలాంటి ముఖ్యమైన పనులు ఉన్నా, వాటిని మధ్యాహ్నానికి ముందుగానే పూర్తి చేసుకోండి. ఈ హెచ్చరిక కేవలం హైదరాబాద్ పబ్లిక్‌కే కాదు, తెలంగాణా వాసులకే కాదు, ప్రపంచమంతా శాస్త్రవేత్తలు అందించిన కీలక సూచన. ఈ రోజు ప్రజలు ఒక కొత్త అనుభూతిని పొందబోతున్నారు. సాధారణంగా రోజులో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటాయి. కానీ డిసెంబర్ 21, 2024 అంటే ఈ రోజు, ప్రపంచం అత్యంత సుదీర్ఘమైన రాత్రిని … Read more

జమిలి ఎన్నికలు: ఏ పార్టీలు మద్దతు, ఏవి వ్యతిరేకం?

జమిలి ఎన్నికలు: ఏ పార్టీలు మద్దతు, ఏవి వ్యతిరేకం? నేడు జమిలి ఎన్నికల బిల్లును కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై పార్టీల వైఖరి ఎలా ఉందంటే? పార్లమెంట్ శీతాకాల సమావేశాల 17వ రోజున, ఈ రోజు ప్రభుత్వం లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు డిసెంబర్ 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒకే … Read more

Vedika Media