Vedika Media

Vedika Media

vedika logo

పుష్ప సినిమాపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు

తెలంగాణ మంత్రి సీతక్క హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాకు జాతీయ అవార్డు లభించడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఎర్రచందనం దొంగలకు జాతీయ అవార్డు ఇవ్వడం ఏమిటి?” అని ప్రశ్నించారు. “జై భీమ్” లాంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదని, కానీ పోలీసులను అవమానించే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “మానవ హక్కులను కాపాడే లాయర్‌ను జీరోగా చూపిస్తూ, స్మగ్లర్‌ను హీరోగా చిత్రీకరించడం సరికాదు” అని మండిపడ్డారు.

“సినిమాలో స్మగ్లర్ హీరో అయితే, స్మగ్లింగ్‌ను అరికట్టే పోలీసు విలన్ ఎలా అవుతాడు?” అని ప్రశ్నిస్తూ, ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తులను ప్రోత్సహిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్ అయినా, ప్రజలకు మంచి సందేశాలు ఇవ్వాలి. సినిమా నటులు, నిర్మాతలు, దర్శకులు సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలతో సినిమాలు తీయాలి అని సీతక్క అన్నారు.

అంత‌టా క్రిస్మ‌స్ సంద‌డి.. ఈ చ‌ర్చిల ప్ర‌త్యేక‌త ఇదే

హైదరాబాద్‌ నగరం వివిధ సంస్కృతుల స‌మాగ‌మం. ఇక్కడ అనేక మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. క్రైస్తవ మతానికి చెందినవారు ఇక్కడ గణనీయ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్‌లో పలుచారిత్రక, ఆధునిక చర్చిలు ఉన్నాయి. ఈ చర్చిలు కేవలం ఆరాధన స్థలాలు మాత్రమే కాకుండా, నగరంలోని వారసత్వ భవనాలుగా కూడా ప్రసిద్ధి చెందాయి.

1. మెదక్ కేథడ్రల్
ఆసియాలోనే అతిపెద్ద కేథడ్రల్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన మెదక్ కేథడ్రల్ హైదరాబాద్‌కు సమీపంలో ఉంది. ఈ అద్భుతమైన నిర్మాణం.. ఎంతో విశాలమైన ప్రాంగణం, అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

2. సెయింట్ జోసెఫ్ చర్చ్, చార్మినార్
చార్మినార్‌కు సమీపంలో ఉన్న సెయింట్ జోసెఫ్ చర్చ్ 16వ శతాబంలో నిర్మిత‌మ‌య్యింద‌ని చెబుతారు. ఇది హైదరాబాద్‌లోని పురాతన చర్చిలలో ఒకటి. ఈ చర్చి ఘ‌న‌మైన నిర్మాణశైలి క‌లిగివుంది. ఈ చ‌ర్చికి చారిత్రక ప్రాముఖ్యత ఎంతో ఉంది.

3. సెయింట్ జార్జ్ చర్చ్, అబిడ్స్
అబిడ్స్‌లో ఉన్న సెయింట్ జార్జ్ చర్చ్ 1869లో నిర్మిత‌మ‌య్యింది. ఇది గోతిక్ శైలిలో నిర్మిత‌మైన‌ అందమైన చర్చి. ఈ చర్చి తన అద్భుతమైన గాజు కిటికీలు, శిల్పాలకు ప్రసిద్ధి చెందింది.

4. సెయింట్ మేరీస్ చర్చ్, సికింద్రాబాద్
సికింద్రాబాద్‌లో ఉన్న సెయింట్ మేరీస్ చర్చ్ 1842లో నిర్మించబడింది. ఇది బ్రిటిష్ కాలం నాటి నిర్మాణం. ఈ చర్చి తన విశాలమైన ప్రాంగణం మరియు శాంతియుత వాతావరణం కోసం ప్రసిద్ధి చెందింది.

5. సెయింట్ ఆండ్రూస్ చర్చ్, బేగంపేట్
బేగంపేట్‌లో ఉన్న సెయింట్ ఆండ్రూస్ చర్చ్ 1867లో నిర్మించబడింది. ఇది గోతిక్ శైలిలో నిర్మించబడిన మరొక అందమైన చర్చి. ఈ చర్చి తన అద్భుతమైన ఆర్కిటెక్చర్ మరియు శాంతియుత వాతావరణం కోసం ప్రసిద్ధి చెందింది.

ఇవేకాకుండా హైదరాబాద్‌లో అనేక చర్చిలు ఉన్నాయి. ప్రతి చర్చి ప్రత్యేక‌ చరిత్ర, ఆర్కిటెక్చర్‌తో ప్రత్యేకంగా క‌నిపిస్తుంది. ఈ చర్చిలు కేవలం ఆరాధన స్థలాలుగా మాత్రమే కాకుండా, నగరంలోని వారసత్వ భవనాలుగా కూడా ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్‌ను సందర్శించేవారు ఈ చర్చిలను చూసినన‌ప్పుడు సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌వుతుంటారు.

ట్రాన్స్ జెండర్లకు గౌరవప్రదమైన ఉద్యోగాలు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ సిగ్నల్ ల వద్ద వాహనదారుల దగ్గర డబ్బులు వసూలు చేసేవారు. అయితే ఇప్పుడు అదే ట్రాఫిక్ సిగ్నల్ ల వద్ద ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నారు. ట్రాన్స్ జెండర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు, వారిని హోంగార్డు స్థాయి ఉద్యోగాల్లో నియమించి, సమాజంలో గౌరవప్రదమైన జీవితం సాగించేందుకు అవకాశాలు కల్పించారు. శారీరక మార్పుల … Read more

తెలుగు రాష్ట్రాల్లో నానా హడావిడి చేసిన అఘోరీ: NHRCకి విలేకరి ఫిర్యాదు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల అఘోరీ పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. నమ్మకం, భక్తితో గుర్తించే అఘోరీ విధానం మర్చిపోయి, న్యూసెన్స్ సృష్టించిన ఈ అఘోరీ తెరమీదకి వచ్చింది. మంగళగిరి, వరంగల్ వంటి ప్రాంతాల్లో ఈ అఘోరీ తన చేష్టలతో భయభ్రాంతులకు గురిచేసింది. గత నెల 18న మంగళగిరి ఆటోనగర్ వద్ద కార్ వాష్ సెంటర్‌లో జరగిన ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. విలేకరులు వార్తల కవరేజ్‌కి వెళ్లిన సమయంలో అఘోరీ మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ … Read more

తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు: ఏపీలో చంద్రబాబు సర్కారు ఏం చేయబోతోంది?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం టాలీవుడ్ పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండవని, అనుమతి ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించారు. సంక్రాంతి సీజన్‌ను లక్ష్యంగా చేసుకున్న భారీ బడ్జెట్ సినిమాలకు ఈ నిర్ణయం వల్ల భారీ ప్రభావం పడనుంది. ముఖ్యంగా రాబోయే సినిమాలైన ‘గేమ్ ఛేంజర్’, ‘డాకూ మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాల వసూళ్లపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ … Read more

సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కొడుకు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చేరాడు. ఈ విషాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన వివరణను అసెంబ్లీలో కోరగా, సీఎం రేవంత్ రెడ్డి ఒకటొకటిగా వివరించారు. ఈ విషయంలో సినీ … Read more

నా తండ్రి పేరు చెప్పుకుని రాలేదు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తాను తండ్రి పేరు చెప్పుకుని ఈ స్థాయికి రాలేదని చెప్పారు. ఒక్కొక్కడిని తొక్కుకుంటూ  వచ్చానని అన్నారు. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రైతుబంధు అమలులో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. శాసనసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సాగులో లేని భూమి రైతులకు కూడా రైతుబంధు ఇచ్చారని మండిపడ్డారు. రోడ్డు విస్తరణ పనుల్లో పోయిన భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని, రాళ్లకు, రప్పలకు కూడా రైతుబంధు ఇద్దామా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం సర్వనాశనమయిందని దుయ్యబట్టారు. మళ్లీ రాళ్లకు, రప్పలకు రైతుబంధు ఇవ్వాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను ఆదర్శంగా తీసుకుని ఉంటే  ప్రతిపక్షంలో ఉండేవాళ్లమని చెప్పారు. డిపాజిట్లు కోల్పోయిన మీరు మాకు ఆదర్శం కాదని అన్నారు.

అబద్ధాల అధ్యక్షుడు కేసీఆర్ సభకు రావడం లేదని, ఉపాధ్యక్షుడు కేటీఆర్ వస్తున్నారని అన్నారు. అర్ధరాత్రి ఓఆర్ఆర్ ను అమ్మి రుణమాఫీ నిధులిచ్చారని విమర్శించారు.
స్విస్ బ్యాంకుకు అప్పు ఇచ్చే స్థాయికి బీఆర్ఎస్ చేరుకుందని… ఆ పార్టీ రూ. 7 లక్షల కోట్ల రాష్ట్ర అప్పు కూడా తీర్చేస్తుందని రేవంత్ అన్నారు. రాష్ట్ర సంపద  బీఆర్ఎస్ నేతల వద్దే ఉందని చెప్పారు. ఒక్క కేసీఆర్ మాత్రమే రూ. 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, రాష్ట్రాన్ని దోచుకున్న ఆర్థిక ఉగ్రవాదులను వదిలి పెట్టాలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

డిసెంబర్ 21, 2024 అంటే ,ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకే రాత్రి మొదలవుతుందా?

యువర్ అటెన్షన్ ప్లీజ్..! మీకు శనివారం ఎలాంటి ముఖ్యమైన పనులు ఉన్నా, వాటిని మధ్యాహ్నానికి ముందుగానే పూర్తి చేసుకోండి. ఈ హెచ్చరిక కేవలం హైదరాబాద్ పబ్లిక్‌కే కాదు, తెలంగాణా వాసులకే కాదు, ప్రపంచమంతా శాస్త్రవేత్తలు అందించిన కీలక సూచన. ఈ రోజు ప్రజలు ఒక కొత్త అనుభూతిని పొందబోతున్నారు. సాధారణంగా రోజులో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటాయి. కానీ డిసెంబర్ 21, 2024 అంటే ఈ రోజు, ప్రపంచం అత్యంత సుదీర్ఘమైన రాత్రిని … Read more

యువతీయువకులకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు

హైదరాబాద్ ఐటీ హబ్‌గా ఉన్న కారణంగా ఇక్కడ పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర రంగాలలో కూడా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు లభిస్తాయి.

పార్ట్‌టైమ్ ఉద్యోగాలు- ప్రయోజనాలు:

అదనపు ఆదాయం: స్వంత అవసరాలకు ఖర్చు చేయడానికి లేదా భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

అనుభవం: వివిధ రంగాలలో పనిచేయడం ద్వారా అనుభవం పొందవచ్చు.

నైపుణ్యాల అభివృద్ధి: కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి వేదిక.

నెట్‌వర్కింగ్: వివిధ రకాల వ్యక్తులతో పరిచయం పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది.

హైదరాబాద్‌లో యువతీయువకులు చేసుకోగలిగే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు

టెక్ సపోర్ట్: కస్టమర్ల సమస్యలను పరిష్కరించడం, సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వంటి పనులు.

డేటా ఎంట్రీ: డేటాను సేకరించి, సిస్టమ్‌లోకి ఎంటర్ చేయడం.

కంటెంట్ రైటింగ్: బ్లాగ్ పోస్ట్‌లు, ఆర్టికల్స్ వ్రాయడం.

సోషల్ మీడియా మార్కెటింగ్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కంపెనీలకు ప్రమోషన్ చేయడం.

ట్యూషన్: విద్యార్థులకు ట్యూషన్ చెప్పడం.

కస్టమర్ సర్వీస్: కస్టమర్లకు ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా సహాయం చేయడం.

ఫ్రీలాన్సింగ్: మీ నైపుణ్యాలను ఉపయోగించి ఇంటి నుండే పని చేయడం. (ఉదాహరణకు: గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్‌మెంట్, వాయిస్‌ఓవర్)

ఈ-కామర్స్: ఆన్‌లైన్ స్టోర్‌లలో ఉత్పత్తులను ప్యాక్ చేసి, షిప్ చేయడం.

ఫుడ్ డెలివరీ: ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఆహారాన్ని డెలివరీ చేయడం

పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఎక్కడ వెతకాలి

ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్: Indeed, Naukri, LinkedIn వంటి వెబ్‌సైట్‌లు.

సోషల్ మీడియా: ఫేస్‌బుక్ గ్రూప్‌లు, లింక్డ్‌ఇన్ గ్రూప్‌లు.

కళాశాల క్యాంపస్‌లు: కళాశాల క్యాంపస్‌లలో పోస్టర్‌లు, నోటీస్‌బోర్డులను చూడండి.

స్థానిక వార్తాపత్రికలు: స్థానిక వార్తాపత్రికలలో వచ్చే జాబ్ అడ్వర్టైజ్‌మెంట్‌లను చూడండి.

ముఖ్యమైన సూచనలు

మీ నైపుణ్యాలను గుర్తించండి: మీకు ఏ రకమైన పనులు చేయడం ఇష్టం అనేది తెలుసుకోండి.

మీకు కావాల్సిన పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం శోధించండి: మీకు నచ్చిన రంగంలో పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం వెతకండి.

ఇంటర్వ్యూకు సిద్ధంగా ఉండండి: ఇంటర్వ్యూకు ముందు మీ గురించి, మీ నైపుణ్యాల గురించి తెలుసుకుని, ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసుకోండి.

సమయ నిర్వహణ: పార్ట్‌టైమ్ ఉద్యోగంతో పాటు మీ చదువు లేదా ఇతర పనులకు కూడా సమయం కేటాయించండి.

హైదరాబాద్‌లో యువతీయువకులకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం కష్టపడితే మీకు నచ్చిన పార్ట్‌టైమ్ ఉద్యోగం లభిస్తుంది.

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట…

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట తెలంగాణ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు హైకోర్టు నుండి తాత్కాలిక ఊరట లభించింది. ఫార్ములా-E రేస్‌ కేసు క్వాష్‌ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇరువైపుల వాదనలు విచారించి, కేటీఆర్‌ను 10 రోజులు అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది. కేసు వివరాలు: ఫార్ములా-E రేస్‌ కేసులో ఏసీబీ చర్యలు చేపట్టిన సమయంలో, కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కౌన్సిల్‌ క్వాష్‌ పిటిషన్‌కి అనుమతి లేదని చెప్పడంతో, లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. … Read more

Vedika Media