Vedika Media

Vedika Media

vedika logo

2024లో బాక్సాఫీస్‌ను దులిపేసిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్లు

2024 సంవత్సరం బాలీవుడ్‌కి చాలా ఉత్తేజకరమైన సంవత్సరం. ఈ ఏడాది అనేక రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొన్ని సినిమాలు భారీ విజయం సాధించగా, మరికొన్ని సినిమాలు అంచనాలకు తగ్గకుండా నిలిచాయి. 1. పఠాన్ నటులు: షారుఖ్ ఖాన్, దీపికా పదుకోణ్, జాన్ అబ్రహం కథ: ఒక అంతర్జాతీయ స్పై తన దేశాన్ని కాపాడటానికి చేసే పోరాటం. విశేషాలు: ఈ సినిమా బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమాల్లో ఒకటి. షారుఖ్ ఖాన్ కెరీర్‌లో … Read more

2024 లొ విజ‌యం సాధించిన తెలుగు సినిమాలు

2024 తెలుగు చిత్ర పరిశ్రమకు బాగానే కలిసొచ్చింది. జనవరిలో ‘హనుమాన్’ సినిమాతో మొదలు పెడితే.. డిసెంబర్ లో పుష్ప 2తో కంటిన్యూ అవుతూనే ఉంది. మొత్తంగా ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ విషయానికొస్తే..

హనుమాన్.. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి హేమాహేమీలకు చుక్కులు చూపించి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

టిల్లు స్క్వేర్ .. సిద్దు జొన్నలగడ్డ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ చిత్రం చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి 2024 టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 

కల్కి 2898 AD.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గా రూ. 1111 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి 2024లో హ్యూజు బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కమిటీ కుర్రోళ్లు.. నిహారిక కొణిదెల సమర్పణలో అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ సినిమా 2024లో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని నమోదు చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఆయ్.. ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ నార్నే హీరోగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆయ్’ . ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మత్తు వదలరా.. 2.. శ్రీ సింహా కోడూరి హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మత్తు వదలరా ..2’. ఈ సినిమా 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

దేవర పార్ట్ 1.. ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు జూనియర్) కథానాయకుడిగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రం ఓవరాల్ గా రూ. 501 కోట్ల గ్రాస్ వసూల్లతో దుమ్ము దులిపింది. ఈ చిత్రం 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

క.. కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్ – సందీప్ ద్వయం దర్శకత్వం వహించిన చిత్రం ‘క’. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలైన సంచలన విజయం సాధించింది

లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 108 కోట్ల గ్రాస్ వసూల్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

పుష్ప 2 ది రూల్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైన భారతీయ బాక్సాఫీస్ దగ్గర 2024లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా దాదాపు రూ. 1500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీ, కన్నడ, ఓవర్సీస్ లో మంచి విజయం సాధించింది. ఎక్కువ రేటుకు అమ్మడంతో పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఏరియాలో కూడా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. కానీ ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కంట త‌డిపెట్టించే ఆర్ నారాయ‌ణ‌మూర్తి ల‌వ్ స్టోరీ

న‌టుడు ఆర్ నారాయ‌ణ‌మూర్తి గురించి తెలియ‌న‌వారెవ‌రూ ఉండరు. ఈయ‌న బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల హీరోగా పేరొందారు. ఇటీవ‌ల ఆయ‌న ఒక‌ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ న‌టుడు ఆర్ నారాయ‌ణ‌మూర్తి గురించి తెలియ‌న‌వారెవ‌రూ ఉండరు. ఈయ‌న బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల హీరోగా పేరొందారు. నారాయణమూర్తి మాట్లాడుతూ.. తన ప్రేమ కథ చెప్పారు. మీరు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారా.? అన్న ప్రశ్నకు నారాయణమూర్తి ఆన్సర్ ఇస్తూ..” ప్రేమించాను.. కానీ అది విఫలం కాలేదు. ఆ అమ్మాయి నన్ను మనస్పూర్తిగా అభిమానించింది. నేను కూడా ఆమెను మనస్పూర్తిగా అభిమానించా.. అయితే ఓ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను వాళ్ళ పేరెంట్స్ కు పరిచయడానికి రమ్మంటే వెళ్ళాను. మొదటిసారి ఆమె ఇంటికి వెళ్ళాను.

వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు. నా జీవనవిధానం వేరు.. వాళ్ళ జీవనవిధానం వేరు. అప్పుడు అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసా.. నాది ఫ్లాట్ ఫారం బ్రతుకు.. ఆమె చాలా డబ్బున్న అమ్మాయి. నా భార్యను నేను మంచిగా చూసుకోవాలి. నాలా ఫ్లాట్ ఫారం మీద పెట్టకూడదు. నా కోరిక సినిమాల్లో చేయడం. నాకు అవకాశాలు వస్తాయో.. రావో.. ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. ఎందుకు.? ఇప్పుడు పెళ్లి చేసుకొని. ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని ఆమె జీవితాంతం నయరకయాతన పడటం అని.. ఆమెకు వివరంగా చెప్పి.. నన్ను అపార్ధం చేసుకోకండి.. మీరు వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. నేను మద్రాసు వెళ్లిపోతున్నా.. మళ్లీ ఉత్తరాలు రాసుకోవడం వంటివి వద్దు. మీరు పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశా .. అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చింది. నేను కూడా ఏడ్చాను. ఆతర్వాత ఆమెతో టచ్ లో లేను. ఆమె ఎక్కడో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. ఆమెను చూడాలనిపిస్తుంది.. మళ్ళీ వెళ్లి ఆమెను చూసి నేను బాధపడాలి ఎందుకు అని వదిలేశా.. అని అన్నారు ఆర్. నారాయణమూర్తి. నిజంగా ఎంత గొప్ప ప్రేమకథ కదా.. ! ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండాలని .. తనను పెళ్లిచేసుకొని జీవితం నాశనం చేసుకోకూడదు అని ఆ ప్రేమనే త్యాగం చేశారు నారాయణమూర్తి.

ప‌వ‌న్ కోసం ప్ర‌పంచంలో అంత‌మంది వెదికారా?

కొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనలు జరిగాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటులు, నటీమణుల జాబితాను గూగుల్ విడుదల చేసింది. విశేషమేమిటంటే.. ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల జాబితాలో హీరో టాలీవుడ్ టాప్ 2లో ఉన్నారు. ఆయనే పవన్ కళ్యాణ్. గూగుల్ విడుదల చేసిన జాబితాలో … Read more

వేణుస్వామిని ఇబ్బంది పెడితే క‌ల్లోల‌మ‌ట‌

వేణు స్వామి .. సినిమా సెలబ్రెటీల జాతకాలు చెప్పడం, రాజకీయనాయకుల జాతకాలు చెప్పడంతో చాలా పాపులర్ అయ్యారు . సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు. సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన వేణు స్వామీ.. మొన్నామధ్య నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ పై ఫైర్ అయ్యాయి. మహిళా కమిషన్‌కి … Read more

కామెడీ కంటెంట్ డీల్ చేయడం కష్టం: ‘అల్లరి’ నరేశ్

‘అల్లరి’ నరేశ్ హీరోగా ఆయన న‌టించిన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’ రూపొందింది. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా అమృత అయ్యర్ కనిపించనుంది. రేపు శుక్ర‌వారం థియేటర్లకు ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ తో అల్లరి ‘నరేశ్’ బిజీగా ఉన్నారు. తాజాగా ఒక‌ ఇంటర్వ్యూలో ఆయన ప‌లు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. “మా సొంత బ్యానర్ పై సినిమాలు చేయకపోవడంపై అంద‌రూ అడుగుతున్నారు. ఈవీవీ బ్యానర్ పై సినిమా … Read more

మంచు ఫ్యామిలీ గొడవలో మలుపు: మనోజ్ ఆరోపణలపై తల్లి నిర్మల వివరణ!

మంచు ఫ్యామిలీ గొడవకు కొత్త మలుపు తీసుకొచ్చింది తల్లి మంచు నిర్మల వ్యాఖ్యలు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి గొడవలు జరగలేదని, అప్పుడు జరిగిన సంఘటనలపై స్పష్టతనిచ్చారు. తన చిన్న కొడుకు మంచు మనోజ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఇంట్లోని జనరేటర్‌లో మంచు విష్ణు పంచదార పోశారనే ఆరోపణను ఖండించారు. తన పుట్టినరోజు వేడుకలకు మాత్రమే విష్ణు వచ్చాడని, కేక్ కట్ చేశాక తన సామాన్లు తీసుకుని వెళ్ళిపోయాడని వెల్లడించారు. తల్లి మంచు నిర్మల … Read more

సంధ్య థియేటర్ తొక్కిసలాట: అల్లు అరవింద్ ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించారు

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డిసెంబర్‌ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఈ ఘటనలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు, 9 ఏళ్ల శ్రీతేజ్‌ తీవ్ర గాయాలతో సికింద్రాబాద్ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత రెండు వారాలుగా శ్రీతేజ్‌ పరిస్థితి మెరుగుపడకపోవడంతో, సినిమా నిర్మాత మరియు అల్లు … Read more

నటుడు బెహరా ప్రసాద్ అరెస్ట్‌

ప్రముఖ తెలుగు యూట్యూబ్ నటుడు బెహరా ప్రసాద్‌ను హైదరాబాద్ న‌గ‌రంలోని జుబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర నటిని వేధించిన కేసులో పోలీసులు బెహరా ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు బెహరా ప్రసాద్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంత‌రం ప్రసాద్‌ను కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి బెహరా ప్రసాద్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. అతనిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ టైమ్‌లో … Read more

శ్రీతేజ్‌ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అరవింద్

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిస‌లాట‌లో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించి, కుటుంబ సభ్యులతో ఆయ‌న మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అర‌వింద్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన‌ శ్రీతేజ్ రెండు వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉంద‌ని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఐసీయూలో వెంటిలెటర్‌పై బాధితుడు ఉన్నట్లు చెప్పారు. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని, … Read more

Vedika Media