• Home
  • International
  • ఇంగ్లండ్‌లో బంగారు టాయిలెట్‌ దొంగతనం – 5 నిమిషాల్లో రూ.30 కోట్ల విలువైన కళాఖండం మాయం!
Image

ఇంగ్లండ్‌లో బంగారు టాయిలెట్‌ దొంగతనం – 5 నిమిషాల్లో రూ.30 కోట్ల విలువైన కళాఖండం మాయం!

ఇంగ్లండ్‌లోని బ్లెన్‌హైమ్ ప్యాలెస్‌లో అద్భుతమైన కళాఖండంగా ప్రదర్శించబడిన 98 కేజీల బంగారు టాయిలెట్‌ను దొంగలు కేవలం 5 నిమిషాల్లో చాకచక్యంగా అపహరించారు. దాని విలువ సుమారు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. 2019 సెప్టెంబర్‌లో జరిగిన ఈ సంచలనాత్మక దొంగతనంలో ముఠా సభ్యులు భారీ సుత్తెలతో టాయిలెట్‌ను పగులగొట్టి అక్కడి నుంచి పారిపోయారు.

ఈ కేసు ఆక్స్‌ఫ‌ర్డ్ క్రౌన్ కోర్టులో విచారణకు రాగా, ముగ్గురు నిందితులుగా ఉన్న మైఖేల్ జోన్స్ (39), ఫ్రెడ్ డో (36), బోరా గుక్కుక్ (40) తమపై ఉన్న ఆరోపణలను ఖండించారు. మరో నిందితుడు జేమ్స్ షీన్ (39) మాత్రం తన ప్రమేయాన్ని అంగీకరించాడు. ఈ కేసుపై గత నాలుగు వారాలుగా విచారణ కొనసాగుతోంది.

ఈ బంగారు టాయిలెట్‌ను ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ ‘అమెరికా’ అనే పేరుతో రూపొందించారు. ఇది బ్లెన్‌హైమ్ ప్యాలెస్‌లో సందర్శకుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించబడింది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ ప్రదేశంలో జరిగిన ఈ చోరీ పెద్ద సంచలనాన్ని రేపింది. దొంగలు ప్యాలెస్‌కు రెండు వాహనాల్లో చేరుకుని, చెక్క గేట్లను ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. గోడ నుంచి టాయిలెట్‌ను పగులగొట్టి తక్కువ సమయంలో మాయం చేశారు. అయితే వారు ఉపయోగించిన సుత్తెలను అక్కడే వదిలిపెట్టారు.

ఈ బంగారు టాయిలెట్‌ బీమా విలువ 6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.50 కోట్లు) అని కోర్టులో లాయర్లు తెలిపారు. దొంగలు దానిని చిన్న ముక్కలుగా చేసి విక్రయించి ఉండొచ్చని ప్రాసిక్యూటర్ జులియ‌న్ క్రిస్టోఫర్ తెలిపారు.

Releated Posts

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ సందడి.. రాజకీయ దుమారం!

హైదరాబాద్‌ ఇప్పుడు ప్రపంచ సుందరీమణులతో సందడిగా మారింది. మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి కాగా, పోటీదారులు ఒక్కొక్కరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్నారు. మిస్…

ByByVedika TeamMay 7, 2025

తెలంగాణలో మిస్ వరల్డ్-2025 పోటీలు: చార్మినార్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు ప్రారంభం..

హైదరాబాద్ పాతబస్తీలో మే 31 నుంచి మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదికగా చౌమొహల్లా ప్యాలెస్ (ఖిల్వత్ ప్యాలెస్) ఎంపికైంది.…

ByByVedika TeamMay 6, 2025

హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ పోటీలు: 120 దేశాల అందగత్తెల రాక, ఏర్పాట్లపై Telangana Tourism బిజీ…!!

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీలలో ఒకటైన మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీలు హైదరాబాద్ వేదికగా జరగబోతున్నాయి. ఇది 72వ…

ByByVedika TeamMay 5, 2025

హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 – 120 దేశాల యువతుల హాజరు…

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 7 నుంచి 31 వరకు…

ByByVedika TeamMay 2, 2025

Leave a Reply