తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే సీజన్ 8 పూర్తి చేసుకుని, త్వరలోనే సీజన్ 9 ప్రారంభం కానుంది. బిగ్ బాస్ సీజన్ 9కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

నాగార్జున హోస్టింగ్ పై నెగిటివిటీ
ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు షోకు అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కానీ సీజన్ 8లో ఆయన హోస్టింగ్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ టీం కొత్తగా హోస్ట్‌ను మార్చాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణకు ఆఫర్.. కానీ!
‘అన్‌స్టాపబుల్’ టాక్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణను బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్టుగా తీసుకురావాలని బిగ్ బాస్ టీం ఆలోచించిందట. కానీ బాలయ్య ఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో, మరో క్రేజీ హీరో వైపు అడుగులేసినట్లు సమాచారం.

బిగ్ బాస్ హోస్ట్‌గా విజయ్ దేవరకొండ?
ఓవర్ నైట్ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి హోస్టుగా వ్యవహరించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ టీం విజయ్‌ను సంప్రదించగా, భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. రౌడీ హీరో కూడా హోస్టింగ్ కొత్త చాలెంజ్‌గా తీసుకుంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెట్టింట్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ సెలబ్రిటీలే!
బిగ్ బాస్ సీజన్ 9లో పాపులారిటీ ఉన్న సెలబ్రిటీస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఇప్పటికే కొన్ని పేర్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే, వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ ప్రోమో వచ్చే వరకు వేచి చూడాల్సిందే!