మన దేశంలో టీ ప్రియులు ఎందరో ఉన్నారు. రోజు టీ తాగకపోతే పని మొదలయ్యేలా ఉండదనే స్థాయికి అలవాటు అయిపోయారు. అయితే ఆరోగ్య నిపుణుల చెబుతున్నదాని ప్రకారం, ఒక నెల రోజుల పాటు టీ, కాఫీ తాగకపోతే శరీరంలో అనేక లాభదాయకమైన మార్పులు జరుగుతాయి.

ముఖ్యంగా నిద్ర నాణ్యతలో స్పష్టమైన మెరుగుదల ఉంటుంది. టీ లో ఉండే కెఫైన్ నిద్రలేమికి కారణమవుతుంది. టీ మానేసినవారు ఎక్కువ సమయం నిద్రపోతారు, తొందరగా పడుకుంటారు అని అధ్యయనాల్లో తేలింది.
ఇక రక్తపోటు విషయానికి వస్తే, టీ మానడం ద్వారా బీపీ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ లెవల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. టీ అధికంగా తాగేవారిలో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల పాటు టీ మానేస్తే ఈ సమస్యలు తగ్గుతాయి. అలాగే, టీ వల్ల దంతాలపై పసుపు పదార్థం పేరుకుపోతుంది. దీని వలన పళ్ళు మారగడం, మొరిగిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. టీ మానినవారు ఎక్కువగా హైడ్రేటెడ్‌గా, చురుకుగా ఉంటారు. ఆరోగ్య పరంగా ప్రయోజనాలు పొందాలనుకుంటే కనీసం ఒకసారి టీ తాగడం మానడం ట్రై చేయవచ్చు. అయితే, ఈ సమాచారం ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మాత్రమే. ఎలాంటి వైద్య సమస్యలైతే ఉన్నా నేరుగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.