మాస్ యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన నందమూరి బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ సీన్స్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సినిమాల్లో ఉండే ఫైట్స్ అభిమానులకు కిక్ ఇస్తుంటాయి. కానీ ఒక సారే ఊహించండి… బాలయ్య సినిమాలో ఒక్క యాక్షన్ సీన్ కూడా లేకపోతే ఎలా ఉంటుందో! ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. బాలకృష్ణ నటించిన “నారీ నారీ నడుమ మురారి” అనే సినిమా యాక్షన్ లేకుండానే బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది.

ఈ చిత్రం 1990 ఏప్రిల్ 25న విడుదలైంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. శోభన, నిరోష కథానాయికలుగా నటించారు. బాలయ్య ఇద్దరు అమ్మాయిలు ప్రేమించే యువకుడిగా కనిపించగా, సినిమాలో ఏ ఫైట్స్ లేకుండా కేవలం ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా మీదనే కథ నడిచింది. అయినా ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.
ఆ రోజుల్లో ‘ఫైట్స్ లేకుండా బాలయ్య సినిమా?’ అనే డౌట్ మేకర్స్‌కి, ట్రేడ్ వర్గాలకు ఉండేది. కానీ రిలీజ్ తర్వాత థియేటర్ల ముందు క్యూలైన్లే ఆ అనుమానాలన్నింటికీ సమాధానం ఇచ్చాయి. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో 50వ చిత్రంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం బాలకృష్ణ “అఖండ 2” సినిమా పనుల్లో ఉన్నారు. కానీ “నారీ నారీ నడుమ మురారి” మాత్రం బాలయ్య సినిమాలో యాక్షన్ లేకుండా హిట్ అయిన అరుదైన మైలురాయి సినిమాగా నిలిచిపోతోంది.