• Home
  • Entertainment
  • బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ..! బాబిల్ ఖాన్ ఎమోషనల్‌ అవుట్‌బర్స్ట్‌పై వైరల్ చర్చ!
Image

బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ..! బాబిల్ ఖాన్ ఎమోషనల్‌ అవుట్‌బర్స్ట్‌పై వైరల్ చర్చ!

బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీగా అభివర్ణిస్తూ నటుడు బాబిల్ ఖాన్ పెట్టిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడైన బాబిల్.. బాలీవుడ్‌లో నకిలీ సంబంధాలు, నెపోటిజం వల్ల తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడాడు. అనన్య పాండే, అర్జున్ కపూర్, షనయా కపూర్ లాంటి స్టార్ కిడ్స్‌పై అసహనం వ్యక్తం చేశాడు.

బాలీవుడ్ నిజాయితీకి భిన్నంగా నడుస్తున్నదని, ఇది పని చేయడానికి మంచి స్థలం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది సేపట్లోనే డిలీట్ చేసి, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా డీయాక్టివేట్ చేశాడు. అయితే కొన్ని గంటల తర్వాత మళ్లీ ఇన్‌స్టాలోకి వచ్చిన బాబిల్, తన వీడియోను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నాడు. తనకు మద్దతుగా నిలిచిన స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. అతను తాజా నటించిన ‘లాగ్ అవుట్’ మూవీతో ప్రచారం కోణంలో ఇలా చేశాడా? లేక నిజంగా తనకు ఎదురవుతున్న మానసిక ఒత్తిడిని పంచుకున్నాడా? అన్నదాని మీద నెటిజన్లలో చర్చ జరుగుతోంది. నిజంగా యువ నటులు ఎదుర్కొంటున్న ఒత్తిడికి ఇది ప్రతిబింబమా? లేక సినిమా ప్రమోషన్ ట్రిక్‌మా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply