• Home
  • Andhra Pradesh
  • అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు…జీతం ఎందుకు ??
Image

అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు…జీతం ఎందుకు ??

ప్రజా ప్రతినిధులంటే ప్రజల సేవకులు. వారు కూడా ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగులే. ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రతి నెలా జీతభత్యాలు తీసుకునే వారు. అలాంటి వారు తమకు ఓటు వేసిన ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే ఎలా? అనే ప్రశ్నను ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో లేవనెత్తారు.

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు కొంత మంది హాజరైనట్లు రిజిస్టర్‌లో సంతకాలు చేసినా, వారెవరూ సభలో కనిపించలేదని చంద్రబాబు తెలిపారు. గవర్నర్ ప్రసంగం అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా కేవలం హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేయడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ధైర్యంగా సభకు రాలేరా? దొంగల్లా వచ్చి సంతకాలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీకి రాకుండా మాజీ సీఎం కేసీఆర్ 57 లక్షల జీతం తీసుకున్నారని విమర్శించారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఉండటం సమంజసమా? తెలంగాణ అభివృద్ధి కోసం హౌస్‌లో చర్చించకుండా ఉండిపోవడం తగినదా? అని రేవంత్ ప్రశ్నించారు.

అసెంబ్లీ హాజరు అంశంపై ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ అయ్యారు. దీనిపై భవిష్యత్తులో వీరి తీరు మారుతుందా? లేక ఈ విధంగానే కొనసాగుతుందా? అనేది చూడాలి.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply