• Home
  • Entertainment
  • అమెరికా ఉద్యోగాన్ని వదిలి బుల్లితెరపై వెలిగిన అషు రెడ్డి ప్రయాణం…!!
Image

అమెరికా ఉద్యోగాన్ని వదిలి బుల్లితెరపై వెలిగిన అషు రెడ్డి ప్రయాణం…!!

టిక్ టాక్ వీడియోలు, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ పొందిన అషు రెడ్డి, ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అమెరికాలో లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి, ఇప్పుడు బుల్లితెరపై బిజీగా మారింది.

మొదట కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది. తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ గురించి చాలా మందికి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలియకపోవచ్చు. ఆమె తెలుగులో ఓ సినిమా చేసింది అన్న విషయం బిగ్ బాస్ కంటే ముందు.

విశాఖపట్నం కు చెందిన అషు రెడ్డి, MBAలో HR మేనేజ్మెంట్ పూర్తి చేసింది. ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగం చేసి, లక్షల్లో జీతం పొందింది. ఉద్యోగం చేస్తూనే టిక్ టాక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది.

అప్పుడు ఆమెకు పవన్ కళ్యాణ్ నిర్మాతగా, నితిన్ హీరోగా నటించిన “ఛల్ మోహన్ రంగ” సినిమాలో అవకాశం వచ్చింది. అమెరికాలోనే షూటింగ్ జరగడంతో, ఆ సినిమాలో నటించానని అషు చెబుతుంది. అదే సమయంలో ఆమెకు ఇండస్ట్రీపై మక్కువ పెరిగి, ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు తిరిగొచ్చింది.

2018లో విడుదలైన “ఛల్ మోహన్ రంగ” సినిమాలో ఆమె అమెరికాలో ఉండే సన్నివేశాల్లో హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్‌గా కనిపిస్తుంది. ఆ సినిమా తర్వాత 2019లో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది.

ప్రస్తుతం అషు రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తోంది. అలాగే బుల్లితెరపై పలు రియాల్టీ షోల్లో పాల్గొంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply