ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమయ్యే వరుస సెలవులు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు విశ్రాంతి నిచ్చే అవకాశం కల్పిస్తున్నాయి. ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 14 వరకు మొత్తం ఐదు రోజులు వరుస సెలవులు లభించనున్నాయి. దీనిని పురస్కరించుకుని ఉద్యోగులు, కుటుంబాలు చిన్న టూర్‌లకు ప్లాన్ చేసుకునే అవకాశముంది.

ఏప్రిల్ 10 – మహావీర్ జయంతి
ఏప్రిల్ 11 – మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి
ఏప్రిల్ 12 – శనివారం
ఏప్రిల్ 13 – ఆదివారం
ఏప్రిల్ 14 – డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి
ఈ ఐదు రోజులు వరుసగా సెలవులు రావడం వల్ల పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు దీర్ఘ విశ్రాంతి లభించే అవకాశం ఉంది. అయితే కొన్ని పాఠశాలల్లో శనివారం (ఏప్రిల్ 12) పని దినంగా ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఒక్క రోజు సెలవు తీసుకుంటే కూడా వరుసగా ఐదు సెలవులు సాధ్యమే.
ఇంకా చెప్పుకోదగిన విషయం ఏమంటే, ఏప్రిల్ 18, 19, 20 తేదీలలో మళ్లీ మరో వారం చివరి మూడు రోజుల సెలవులు వస్తున్నాయి.
ఏప్రిల్ 18 – గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 19 – శనివారం
ఏప్రిల్ 20 – ఆదివారం
ఈ సెలవులు కూడా కుటుంబంతో కలిసి ప్రయాణించాలనుకునేవారికి మరో మంచి అవకాశం. ఇక ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం.
ఈ విధంగా ఏప్రిల్ నెల మొత్తం సెలవులతో నిండిపోయి, ఉద్యోగులు, విద్యార్థులకు విశ్రాంతి, వినోదం కలగనున్నాయి.