• Home
  • Andhra Pradesh
  • వేగంగా పెరుగుతున్న రక్తపోటు, షుగర్‌, కొవ్వు కాలేయం సమస్యలు – అపోలో తాజా హెచ్చరిక..!!
Image

వేగంగా పెరుగుతున్న రక్తపోటు, షుగర్‌, కొవ్వు కాలేయం సమస్యలు – అపోలో తాజా హెచ్చరిక..!!

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక మంది ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అపోలో హాస్పిటల్స్ సోమవారం విడుదల చేసిన ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025’ నివేదిక దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర వివరాలు అందించింది. “లక్షణాల కోసం వేచిచూడకండి, ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చుకోండి” అనే సందేశంతో ఈ ఐదవ ఎడిషన్‌ను విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా 25 లక్షలమందిపైగా ఆరోగ్య పరీక్షలు ఆధారంగా రూపొందిన ఈ నివేదికలో ‘నిశబ్ధ మహమ్మారి’గా పేర్కొంటూ – లక్షణాలు లేకుండానే లక్షలాది మంది ప్రజలు వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

  • 26% మందికి రక్తపోటు
  • 23% మందికి మధుమేహం
  • 66% మందికి కొవ్వు కాలేయం
  • వీరిలో 85% మందికి మద్యపానం అలవాటు లేని వారే
    అయినప్పటికీ వారిలో వ్యాధుల లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణలో ప్రత్యేకంగా చూస్తే:

  • 44,448 మందికి పరీక్షలు
  • 10,427 మందికి అధిక రక్తపోటు
  • 24,246 మందికి ప్రీహైపర్‌టెన్షన్
  • 10,355 మందికి మధుమేహం
  • 14,000 మందికి మధుమేహం వచ్చే సూచనలు
  • 63% మందికి ఊబకాయం, 19% మందికి అధిక బరువు
  • 47% మందికి డిస్‌లిపిడెమియా
  • 3% మందికి మానసిక సమస్యలు (డిప్రెషన్, వ్యాకులత)

కాలేయ సమస్యలు:

  • 32,333 మందిలో 49% మంది గ్రేడ్‌ 1 ఫ్యాటీ లివర్
  • 5% మందికి గ్రేడ్‌ 2
  • 80 మందికి గ్రేడ్‌ 3
  • 6 మందికి గ్రేడ్‌ 4
  • 82% మందికి విటమిన్ డి లోపం

ఈ నివేదిక ఆధారంగా ప్రజలు ఆరోగ్యంపై మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Releated Posts

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అడవిని రక్షించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్..!!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిధిలోని విలువైన పచ్చదనాన్ని రక్షించేందుకు “బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ” మరోసారి న్యాయపోరాట బాట పట్టింది. యూనివర్శిటీ పరిధిలోని…

ByByVedika TeamApr 18, 2025

ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు ఇప్పుడు మాతృభాషలో: AICTE కీలక ప్రణాళిక..

ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం,…

ByByVedika TeamApr 18, 2025

ఏపీ లిక్కర్ స్కాం కేసు – సిట్ విచారణకు విజయసాయిరెడ్డి…!!

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజకీయంగా ప్రభావవంతమైన నేతలపై దృష్టి సారించిన సిట్ అధికారులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని…

ByByVedika TeamApr 18, 2025

హైకోర్టు స్టే: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 నియామకాలపై తాత్కాలిక ఆదేశాలు…!!

హైదరాబాద్, ఏప్రిల్ 18:తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు కొత్త మలుపు తిప్పాయి. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చినప్పటికీ, కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.…

ByByVedika TeamApr 18, 2025

Leave a Reply