ఒకటి, ఒకటి, ఒకటి.. రెండు, మూడు, నాలుగు! ఇవి ఏపీ కాలేజీలు ప్రకటించే ర్యాంకులు కాదు.. రాష్ట్ర మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్‌లో వచ్చిన ర్యాంకులు. అయితే, ఫస్ట్ ప్లేస్‌లో ఎవరు? లాస్ట్ ఎవరు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ర్యాంకులేంటి? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ వరకు మంత్రులు క్లియర్ చేసిన ఫైళ్ల ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకులిచ్చారు.
ఈ ర్యాంక్ లిస్ట్‌లో ఎన్‌ఎండీ ఫరూఖ్ ప్రథమ స్థానంలో నిలిచారు. లాస్ట్ ప్లేస్‌లో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 6వ స్థానం, డిప్యూటీ సీఎం పవన్ 10వ ప్లేస్‌లో ఉన్నారు.
టాప్ 10 మంత్రుల ర్యాంకులు:
1️⃣ ఎన్‌ఎండీ ఫరూఖ్
2️⃣ కందుల దుర్గేష్
3️⃣ కొండపల్లి శ్రీనివాస్
4️⃣ నాదెండ్ల మనోహర్
5️⃣ డోలా బాలవీరాంజనేయస్వామి
6️⃣ సీఎం చంద్రబాబు
7️⃣ సత్యకుమార్
8️⃣ నారా లోకేష్
9️⃣ బీసీ జనార్దన్ రెడ్డి
🔟 పవన్ కళ్యాణ్
మిగతా మంత్రుల ర్యాంకులు:
- సవిత
- కొల్లు రవీంద్ర
- గొట్టిపాటి రవికుమార్
- నారాయణ
- టీజీ భరత్
- ఆనం రామనారాయణరెడ్డి
- అచ్చెన్నాయుడు
- మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
- గుమ్మిడి సంధ్యారాణి
- వంగలపూడి అనిత
- అనగాని సత్యప్రసాద్
- నిమ్మల రామానాయుడు
- కొలుసు పార్థసారథి
- పయ్యావుల కేశవ్
మొత్తంగా, ఫైళ్ల క్లియరెన్స్‌పై ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు.. మంత్రులు మరింత వేగంగా ఫైళ్లు క్లియర్ చేయాలని సూచించారు.














