ఏపీ లిక్కర్ స్కాం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజకీయంగా ప్రభావవంతమైన నేతలపై దృష్టి సారించిన సిట్ అధికారులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కీలక సాక్షిగా భావించి ఆయనకు ఏప్రిల్ 15న నోటీసులు జారీ చేశారు. మొదట 17న విచారణకు హాజరవుతానని సమాచారం ఇచ్చిన విజయసాయిరెడ్డి, ఆ రోజు హాజరుకాలేదు. అయితే తాజగా 18న సిట్ ముందు హాజరవుతానని మరోసారి తెలియజేశారు.

ఇంతకుముందు రాజ్ కసిరెడ్డే లిక్కర్ స్కాం వెనుక కర్త కర్మ క్రియ అంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ విచారణలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో ఆయనను పిలవడం సిట్‌కు అవసరమైంది.
ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా నోటీసులు జారీ కాగా, రాజ్ కసిరెడ్డికి ఏప్రిల్ 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే గతంలో మూడు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన రాజ్ కసిరెడ్డి, ఈసారి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
ఈ కేసులో సిట్ విచారణలో ఎలాంటి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయో, ఎవరి పాత్ర ఏమిటనేదానిపై దర్యాప్తు మరింత దిశగా సాగుతోంది.