అమరావతి, ఏప్రిల్ 12:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10.5 లక్షలమందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయగా, ఎప్పటిలాగే ఈసారి కూడా అమ్మాయిలే టాప్ ర్యాంకులను సాధించి మెరుపులు మెరిపించారు.

విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రభుత్వం ప్రారంభించిన మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు ‘hi’ అని మెసేజ్ పంపితే కూడా ఫలితాలు సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు 26 జిల్లాల్లో 1535 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తైన 20 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తిచేసిన అధికారులు, గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఏప్రిల్ 12న ఫలితాలను విడుదల చేశారు.
విద్యార్థులకు సందేహాల నివృత్తి కోసం బోర్డు టోల్ ఫ్రీ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీలను ప్రకటించనుంది. అలాగే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం తేదీలను, సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఈ రోజే వెల్లడించనున్నారు.