అనుష్క మిస్ శెట్టి Mr పోలిశెట్టి అనే సినిమా తరువాత మళ్ళి వెండితెర మీద కనిపించలేదు. బాహుబలి సినిమా తరువాత రెండు మూడు సినిమాల మినహా ఎక్కువగా కనిపించింది లేదు. కానీ సైజ్ జీరో సినిమా కోసం చాల బాగా కష్టపడ్డారు. ఆమె ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి ఈ సైజు జీరో సినిమా కూడ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఎట్టకేలకు ఒక పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. క్రిష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఘాటీ. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనుష్క పుట్టిన రోజు సందర్బంగా ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. Anushka Upcoming Movies
అంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వేదం అనే సినిమా వచ్చి విమర్శకుల ప్రశంశలు అందుకుంది. క్రిష్ దర్శకత్వం వహించిన గత సినిమాలు భారీ ప్లాప్ అయ్యాయి. దింతో క్రిష్ కి ఈ సినిమా చాలా ప్రస్టేజియస్ గా మారింది. ఈ రోజు విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక సారి గమనిస్తే విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే అక్షరాలు ఉన్నాయి. అంటే సినిమాలో ఎదో కొత్తదనం ఉందని తెలుస్తుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో విడుదల అవుతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.