• Home
  • Entertainment
  • యాంకర్ ప్రదీప్ పెళ్లి రూమర్స్ పై క్లారిటీ.. నిజమేంటంటే?
Image

యాంకర్ ప్రదీప్ పెళ్లి రూమర్స్ పై క్లారిటీ.. నిజమేంటంటే?

యాంకర్ ప్రదీప్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. పలు రియాలిటీ షోలకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ తనదైన కామెడీ టైమింగ్‌తో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు వెండితెరపై కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా విజయాన్ని అందుకున్న ప్రదీప్, ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ప్రదీప్, తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రదీప్ ఓ ప్రజాప్రతినిధితో పెళ్లి చేసుకోనున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన ఆయన, తన పెళ్లి కోసం ఇప్పటివరకు ఎలాంటి ప్లానింగ్ చేసుకోలేదని, కెరీర్‌పై దృష్టి పెట్టానని స్పష్టం చేశాడు. తనకు కొన్ని టార్గెట్లు ఉన్నాయని, వాటిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే పెళ్లి గురించి ఆలోచిస్తానని తెలిపాడు.

ఇక రాజకీయ నాయకురాలితో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై ప్రదీప్ సరదాగా స్పందించాడు. గతంలో రియల్ ఎస్టేట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అమ్మాయితో పెళ్లి వార్తలు వచ్చాయనీ, ఇప్పుడు ప్రజాప్రతినిధితో అంటున్నారనీ, తర్వాత ఓ క్రికెటర్‌తో పెళ్లంటూ రూమర్లు వచ్చే అవకాశం ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

Releated Posts

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో పాన్-ఇండియా పీరియడ్ డ్రామా: అధికారిక ప్రకటన విడుదల…!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను…

ByByVedika TeamApr 8, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు.. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స…!!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదవశాత్తు గాయాలపాలయ్యాడు. సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో…

ByByVedika TeamApr 8, 2025

అమెరికా ఉద్యోగాన్ని వదిలి బుల్లితెరపై వెలిగిన అషు రెడ్డి ప్రయాణం…!!

టిక్ టాక్ వీడియోలు, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ పొందిన అషు రెడ్డి, ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి…

ByByVedika TeamApr 7, 2025

చిన్న సినిమా Court భారీ విజయం తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది!

టాలీవుడ్‌లో పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాలు సాధిస్తుంటాయి. తాజాగా అలాంటి విజయాన్ని అందుకున్న చిన్న సినిమా…

ByByVedika TeamApr 7, 2025

Leave a Reply