భారత ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కేటాయించిన 21 మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులు విపక్షాలకు సాయం చేయడానికే కేటాయించారని, ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది.

బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్ మాట్లాడుతూ, భారత అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో ప్రధాన మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు డోజ్ విభాగం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, వివిధ దేశాలకు అమెరికా అందించే నిధులను కుదించనుంది.
భారత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు కేటాయించిన 21 మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేసినట్లు డోజ్ చీఫ్ ఎలన్ మస్క్ వెల్లడించారు. విదేశాలకు సాయం అందించడం వల్ల అమెరికాకు లాభం లేదని, అందుకే నిధుల కోత విధించినట్లు తెలిపారు.
భారత్‌లో ఓటింగ్ పెరిగితే అధికార పార్టీకి కాకుండా విపక్షాలకు లాభం కలుగుతుందని బీజేపీ నేతలు ఆరోపించారు. అప్పటి బైడెన్ ప్రభుత్వం ఈ నిధులను అందించడం వెనుక కుట్ర ఉన్నట్లు వారు వ్యాఖ్యానించారు. బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్ మాట్లాడుతూ, భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు జార్జ్ సోరస్ కుట్ర పన్నారని ఆరోపించారు.
కేవలం భారత్‌కే కాకుండా, బంగ్లాదేశ్ నిధులకూ కోత విధించబడింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ స్థిరత్వాన్ని పెంచేందుకు కేటాయించిన 29 మిలియన్ డాలర్ల నిధులను డోజ్ విభాగం రద్దు చేసింది. షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత మహ్మద్ యూనస్ ప్రధాన పదవి చేపట్టిన విషయం తెలిసిందే.