అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్నారు. ఆయన 41 దేశాలపై కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం, డజన్ల కొద్దీ దేశాల పౌరులపై అమెరికా వీసా నిషేధం విధించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఒక అంతర్గత మెమో సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మూడు వర్గాలుగా దేశాల విభజన
ఈ ఆంక్షలు మూడు వేర్వేరు గ్రూపులుగా విభజించారు.
- మొదటి గ్రూపు:
- 10 దేశాలు (ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా తదితర దేశాలు)
- వీరి పౌరులకు పూర్తిగా వీసా నిషేధం
- రెండవ గ్రూపు:
- 5 దేశాలు (ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్)
- పాక్షికంగా వీసా నిషేధం (పర్యాటక, విద్యార్థి వీసాలపై ప్రభావం)
- మూడవ గ్రూపు:
- 26 దేశాలు (బెలారస్, పాకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్ మొదలైనవి)
- వీసా జారీపై పాక్షిక నిషేధం
- భద్రతా లోపాలను 60 రోజుల్లోపు తొలగించే అవకాశం
ట్రంప్ విధానానికి నేపథ్యం
ఇది ట్రంప్ పాలనలో మొదటిసారి కాదు. 2018లో ముస్లిం మెజారిటీ దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విధించి, అమెరికా సుప్రీంకోర్టు నుంచి మద్దతు పొందారు. మరోసారి అధ్యక్షుడైన వెంటనే, భద్రతా తనిఖీలను కఠినతరం చేయాలని 2023 జనవరిలో కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. గాజా స్ట్రిప్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ వంటి సున్నితమైన ప్రాంతాల నుండి వచ్చే పౌరులపై నిషేధాన్ని ప్రకటించారు.