భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని ఆయన విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన విస్తృత సేవలను వారు స్మరించుకున్నారు. ఈ వేడుకలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, జెపి నడ్డా, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి కూడా అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు. ఆయన ఆశయాలను సాకారం చేయడం కోసం రాష్ట్రంలో నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం రాజీవ్ యువశక్తి పథకం అమలులో ఉందని తెలిపారు. అంబేద్కర్ పోరాటం ప్రజల హక్కులకే ప్రతీక అని పేర్కొన్నారు.
నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు కూడా ‘ఎక్స్’ వేదికగా అంబేద్కర్‌కు హృదయపూర్వక నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలు కూటమి ప్రభుత్వం పాలనలో కొనసాగుతాయని పవన్ తెలిపారు.
డాక్టర్ అంబేద్కర్ ఒక మహనీయుడు. సామాజిక సమానత్వానికి పాటుపడిన ఈ మహాత్ముడు స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయ మంత్రిగా సేవలందించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1990లో భారతరత్న పురస్కారం లభించింది.