• Home
  • Entertainment
  • బన్నీ 3x పవర్ – అట్లీ డైరెక్షన్‌లో ట్రిపుల్ మాస్ ధమాకా!
Image

బన్నీ 3x పవర్ – అట్లీ డైరెక్షన్‌లో ట్రిపుల్ మాస్ ధమాకా!

‘పుష్ప 2’తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టి సారించాడు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కనిపించబోతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని హిట్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. ‘జవాన్’తో బాలీవుడ్‌లో హవా చూపించిన అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించనున్నాడట. అంటే ఇది త్రిపాత్రాభినయం. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇది ఫస్ట్ టైం. దీంతో సినిమాపై క్రేజ్ మామూలుగా లేదు. దీనికి తగినట్టుగానే కథానాయికలుగా కూడా భారీ పేర్లు వినిపిస్తున్నాయి.

మొదట ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత జాన్వీ కపూర్, దిశా పటానీల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఈ సినిమాకు ఎంపికవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై నేషనల్ లెవెల్‌లో హైప్ పెరిగింది. అధికారికంగా కథానాయికల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

Releated Posts

కేఎల్ రాహుల్ కుమార్తెకు నామకరణం: “ఇవారా” అర్థం ఏమిటి?

భారత క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 24న వీరిద్దరికీ ఓ…

ByByVedika TeamApr 18, 2025

మ్యాడ్ స్క్వేర్ థియేటర్ హిట్‌ తర్వాత ఓటీటీలోకి..??

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో మ్యాడ్ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించిన ఈ యువతరానికి…

ByByVedika TeamApr 18, 2025

సావిత్రి పాటను చెడగొట్టారు – కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్..!!

ఈ మధ్యకాలంలో టెలివిజన్ డాన్స్ షోలు మరీ హద్దులు దాటి పోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్లాసిక్ పాటల పట్ల గౌరవం లేకుండా స్టంట్స్, హాట్…

ByByVedika TeamApr 18, 2025

రాజ్ తరుణ్-లావణ్య మధ్య మరోసారి వివాదం: కోకాపేట్ ఇంటి విషయంలో హైడ్రామా, పోలీస్ ఫిర్యాదు..??

అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న రాజ్‌ తరుణ్, లావణ్య మధ్య వివాదం మళ్లీ కొత్త మలుపు తిరిగింది. ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్‌ లో లావణ్య…

ByByVedika TeamApr 17, 2025

Leave a Reply