• Home
  • National
  • ఉగ్రదాడులకు తగిన ప్రతీకారం: మళ్లీ యుద్ధ భూమిలోకి గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్!
Image

ఉగ్రదాడులకు తగిన ప్రతీకారం: మళ్లీ యుద్ధ భూమిలోకి గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్‌ పాక్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మిస్సైల్ దాడులు చేపట్టింది. పాక్ ప్రజలకు, సైనికులకు హానికరం కాకుండా కేవలం ఉగ్ర స్థావరాలనే టార్గెట్ చేసింది. అయినా పాక్ ప్రతీకారం పేరుతో ఇండియాపై క్షిపణి దాడులు చేస్తున్నది. ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్‌తో భారత్ ఇప్పటికే కొన్ని దాడులను అడ్డుకుంది. అయితే భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎయిర్ ఫోర్స్ మానవ సహిత అంతరిక్ష ప్రయాణం గగన్‌యాన్ కోసం ఎంపిక చేసిన గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్‌ను తిరిగి డ్యూటీలోకి పిలిచింది. ప్రస్తుతం ఢిల్లీలో అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాల్గొంటున్న ఆయన, “ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఐఏఎఫ్ నన్ను తిరిగి పిలిచింది” అని వెల్లడించారు. ఆయన త్వరలో తిరిగి ఎయిర్ ఫోర్స్‌లో చేరనున్నారు.

కృష్ణన్ 2003లో ఎయిర్ ఫోర్స్‌లో చేరి, సుమారు 2,900 గంటల ఫ్లయింగ్ అనుభవం సంపాదించారు. Su-30 MKI, MiG-21, Jaguar, An-32 వంటి ఫైటర్ జెట్లను నడిపిన అనుభవం ఆయనకు ఉంది. ఈ అనుభవం ఇప్పుడు దేశానికి అవసరం అయినందున ఆయన్ను మళ్లీ యాక్టివ్ డ్యూటీలోకి రప్పించారు.

Releated Posts

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణలో తిరుగులేని ఉలుపు – మోదీ గట్టి హెచ్చరికతో పాక్ వెనక్కి…!!

భారత్‌, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం వచ్చిన రెండు రోజులకు, జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా…

ByByVedika TeamMay 12, 2025

భారత ప్రతిదాడి: పాక్ ఎయిర్ బేస్‌లపై భారత వైమానిక దళం దాడులు…!!

పాక్ మళ్లీ భారత సరిహద్దులపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో భారత్ కూడా తీవ్ర ప్రతిదాడికి దిగింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించిన వివరాల…

ByByVedika TeamMay 10, 2025
1 Comments Text
  • 888pg says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Opa! 888pg… Isso me lembra slots da Pragmatic Play! Será que é por aí? 🤔 Alguém aí joga slots nesse site? Contem pra gente se tem bastante variedade! Confiram: 888pg
  • Leave a Reply