• Home
  • Andhra Pradesh
  • AP Exam Results 2025: టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు నేరుగా మొబైల్‌కు.. మంత్రి లోకేశ్‌ ప్రకటన
Image

AP Exam Results 2025: టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు నేరుగా మొబైల్‌కు.. మంత్రి లోకేశ్‌ ప్రకటన

అమరావతి, మార్చి 21: ఏఐ ఆధారిత మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను జూన్‌ 30 నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని, దీని ద్వారా వాయిస్‌ సేవలు అందించనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు.

టెన్త్, ఇంటర్‌ విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్‌ ద్వారా హాల్‌టికెట్లు పొందే సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే, పబ్లిక్‌ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే వాటిని విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు నేరుగా పంపించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఏఐ ఆధారిత వాయిస్‌ సేవల ద్వారా “బస్‌ టికెట్‌ కావాలి” అని నోటితో చెప్పిన వెంటనే టికెట్‌ బుక్‌ చేయబడుతుందని, కరెంటు బిల్లు నంబర్‌ చెబితే అది చెల్లించబడుతుందని తెలిపారు. ఈ సేవలను అన్ని భాషల్లో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు.

తిరుమల తిరుపతి దేవస్థాన సేవలు త్వరలో

రాబోయే 30 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థాన సేవలను కూడా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా అందుబాటులోకి తెస్తామని మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. సర్టిఫికెట్లు ప్రతి ఆరు నెలలకు తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వత ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటయ్యేలా త్వరలో చట్ట సవరణ చేయనున్నట్లు వెల్లడించారు.

ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రాథమిక కీ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ స్క్రీనింగ్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసింది. ఈ కీపై మార్చి 21 నుంచి 23 వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించనున్నారు. మార్చి 16న నిర్వహించిన ఈ పరీక్షకు 7,620 మంది హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.

తెలంగాణ విదేశీ విద్య దరఖాస్తులు ప్రారంభం

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద 2025-26 విద్యా సంవత్సరానికి అర్హులైన ఎస్సీ విద్యార్థులు మార్చి 20 నుంచి మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ-పాస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని, చివరి తేదీకి వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ సూచించింది.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply