ఇండోనేషియా ప్రపంచంలో అత్యధికంగా 130 క్రియాశీల అగ్నిపర్వతాలను కలిగి ఉంది. ఉత్తర మలుకు ప్రావిన్స్‌లోని మౌంట్ డుకోనో ఈ అగ్ని పర్వతాలలో ఒకటి. ఈ మధ్యకాలంలో డుకోనో అగ్నిపర్వతానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. వీడియోలో కత్రినా మరియా అనథాసియా అనే యువతి అగ్ని పర్వతం దగ్గర కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఆమెను మూర్ఖురాలిగా అభివర్ణించారు.
అగ్ని పర్వతం విస్ఫోటనం ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. లావా, బూడిద, విషవాయువుల వల్ల తక్షణ ముప్పు కలుగుతుంది. అయితే మరియా వీడియో ప్రజల దృష్టిని ఆకర్షించింది. మరియా పర్వతారోహణలో అనుభవజ్ఞురాలు అయినప్పటికీ, అగ్ని పర్వతం వంటి ప్రదేశంలో ఈ విధమైన సాహసం చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

మారియా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో మాట్లాడుతూ, ఎలాంటి పర్వతారోహణకైనా ముందస్తు అనుమతి తీసుకోవడం మరియు అనుభవజ్ఞుడైన గైడ్‌తో ప్రయాణించడం అవసరమని తెలిపారు.