• Home
  • Telangana
  • హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Image

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం రేవంత్ రెడ్డి మే 12న అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌ ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC), AI-రెడీ డేటా సెంటర్లు, మరియు తయారీ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మారిందన్నారు. సోనాటా సంస్థ ఆధునిక ఎల్గోరిథంలతో పర్యావరణ అనుకూలమైన పరిష్కారాలను అందిస్తున్నదని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, విప్రో, HCL లాంటి దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరించాయి. ప్రస్తుతం తెలంగాణలో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, లక్షకు పైగా నూతన ఉద్యోగాలు కల్పించామన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు, మహిళలు, యువత కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

2025 దావోస్ పర్యటన ద్వారా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టినట్లు తెలిపారు. పోలీసింగ్, శాంతిభద్రతలు, పన్నుల వసూళ్లు, ద్రవ్యోల్బణ నియంత్రణలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో ఉందన్నారు. ట్రాన్స్‌జెండర్ వలంటీర్లను ట్రాఫిక్ ఫోర్స్‌లో నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.

ఇక ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్‌లో జరగడం గర్వకారణమన్నారు. ఇలాంటి మరిన్ని గ్లోబల్ ఈవెంట్‌లను రాష్ట్రంలో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ వ్యూహం ద్వారా రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, యువత హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రపంచానికి మన విజయాలను తెలియజేయాలని పిలుపునిచ్చారు.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

పెళ్లి పేరుతో మోసం – హైదరాబాద్‌లో యువకుడికి రూ.10 లక్షల నష్టం

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి పేరుతో జరిగిన మోసం కలకలం రేపుతోంది. కోనసీమ జిల్లాకు చెందిన నానీ కుమార్ అనే…

ByByVedika TeamMay 10, 2025

Leave a Reply