న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ పరీక్షలు వాయిదా వేసినట్టు ఇప్పటికే ప్రకటించింది. మొదటగా మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన పరీక్షలు ఇప్పుడు మే 16 నుంచి 24 మధ్య నిర్వహించాలని ICAI తాజా షెడ్యూల్ విడుదల చేసింది.

భద్రతా పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. మారిన షెడ్యూల్ ప్రకారం:
- మే 10 (ఫైనల్ గ్రూప్ II – పేపర్ 5) పరీక్షను మే 16కి,
- మే 13 (INTT–AT పేపర్ 2 & ఫైనల్ గ్రూప్ II – పేపర్ 6) పరీక్షలను మే 18కి,
- మే 9 (ఇంటర్ గ్రూప్ II – పేపర్ 4) పరీక్షను మే 20కి,
- మే 11 (పేపర్ 5 – ఆడిటింగ్ & ఎథిక్స్) పరీక్షను మే 22కి,
- మే 14 (పేపర్ 6 – ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ & స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్) పరీక్షను మే 24కి మార్చారు.
అందిన సమాచారం ప్రకారం, అన్ని రీషెడ్యూల్ చేయబడిన పరీక్షలు అదే పరీక్షా కేంద్రాల్లో మరియు అదే సమయాలలో (మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) జరుగుతాయని వెల్లడించారు. ఇక ఇప్పటికే జారీ చేయబడిన అడ్మిట్ కార్డులు ఈ కొత్త తేదీలకు చెల్లుబాటవుతాయని ICAI స్పష్టం చేసింది.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ICAI అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత శాఖల ద్వారా తాజా సమాచారాన్ని పరిశీలించాల్సిందిగా సూచిస్తున్నారు.