హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలలో ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, ములుగు, నారాయణపేట, వికారాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలు ఉన్నాయి.
రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఖమ్మంలో గరిష్ఠంగా 41.4°C, హైదరాబాద్‌లో కనిష్టంగా 38.9°C నమోదయ్యే సూచన ఉంది.
మే 11న మెదక్‌లో 41.7°C, నిజామాబాద్‌లో 41°C, ఆదిలాబాద్‌లో 39.8°C, ఖమ్మంలో 39.4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాల నేపథ్యంలో పంట పనులు చేస్తున్న రైతులు, ట్రావెలర్లు, విద్యార్థులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.