• Home
  • Entertainment
  • విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!
Image

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే విజయ్ తన రాజకీయ పార్టీయే స్థాపించి రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఇప్పుడు విజయ్ వారసుడు జాసన్ సంజయ్ కూడా ఫిలింలోకి ఎంట్రీ ఇవ్వడం మరో హాట్ టాపిక్.

జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తొలి సినిమాకే తెలుగు హీరో సందీప్ కిషన్‌తో కలిసి పని చేస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక అప్డేట్స్ ఇవ్వనున్నారు.

అయితే తాజాగా సంజయ్‌తో పాటు అక్కినేని అఖిల్ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూసిన అక్కినేని అభిమానులు సంజయ్, అఖిల్ కలిసి సినిమా చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అఖిల్ ప్రస్తుతం కెరీర్ పరంగా క్రూషియల్ ఫేజ్‌లో ఉన్నాడు. ‘ఏజెంట్’ సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు “లెనిన్” అనే మాస్ చిత్రం చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

లెనిన్ పోస్టర్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ పూర్తి మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇక జాసన్-అఖిల్ ఫోటో చూసి ఫ్యాన్స్ “ఏదో భారీ కాంబినేషన్ కుదరబోతోందేమో!” అంటూ ఊహాగానాలు షేర్ చేస్తున్నారు. నిజంగా వాళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారా? అన్నది త్వరలోనే తేలనుంది.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

నాని స్పష్టం: మళ్లీ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా రావడం జరగదు!ఎందుకు అంటే..!!

తెలుగులో బిగ్ బాస్ అనే రియాల్టీ షోకు దేశవ్యాప్తంగా అభిమానులుండగా, ఈ షోను తొలి సీజన్‌లో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌లో న్యాచురల్…

ByByVedika TeamMay 7, 2025

Leave a Reply