సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి మళ్లింది. ఆ ఫొటోల్లో ఇతరులు ఉన్నా, రాజ్‌తో ఉన్న చిత్రాలపైనే ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. “ఫ్యామిలీమేన్” సమయంలో సమంత, రాజ్ మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అప్పటినుంచే గుసగుసలు రేపింది. ఇది “సిటాడెల్” సమయంలో మరింత స్పష్టమైంది. అప్పట్లో సమంత అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రాజ్ మద్దతుగా నిలిచారన్న టాక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజాగా, సమంత తన పికిల్‌బాల్ టీమ్‌ను ప్రకటించినప్పుడు కూడా రాజ్ వెంటే ఉండగా, చేతులు పట్టుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అలాగే ఆమె తిరుపతి వెళ్లినప్పుడు కూడా ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా, సమంత తొలిసారిగా ప్రొడ్యూసర్‌గా మారిన “శుభం” అనే చిత్రంలో రాజ్ నిడిమోరు కూడా భాగంగా ఉన్నారు. ఇక ట్రాలాలా అనే సంస్థ గురించి ఆమె పోస్ట్ పెట్టిందా? లేదా రాజ్‌తో బంధాన్ని సంకేతంగా చెప్పిందా? అనే ఉహాగానాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
