• Home
  • Andhra Pradesh
  • పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..
Image

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం ఇస్తున్నాయి. దీంతో దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలోకి చేరింది. ఐదు దిక్కులా దాడులకు పాల్పడుతున్న భారత్ నుంచి తలదాచుకోవడానికి పాకిస్తాన్ కొత్తగా సైబర్ యుద్ధానికి దిగినట్లు తెలుస్తోంది.

ఇటీవల “డాన్స్ ఆఫ్ ది హిల్లరీ వైరస్” పేరుతో మాల్వేర్ పంపిణీ జరగుతోంది. ఈ వైరస్‌ను వీడియో ఫైల్స్, డాక్యుమెంట్స్ రూపంలో పంపుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. వైరస్ యాక్టివేట్ అయిన వెంటనే మొబైల్ లేదా కంప్యూటర్ వ్యవస్థలను దెబ్బతీసి, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం వంటి కీలక డేటాను హ్యాకర్లు ఎత్తుకుపోతున్నారు. ప్రత్యేకించి WhatsApp, Telegram, Email, Facebook ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ మాల్వేర్ పంపిణీ అవుతోంది.

భారత భద్రతా సంస్థలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి – అనుమానాస్పద లింకులు, అపరిచితుల నుంచి వచ్చిన ఫైళ్లను తెరవొద్దని, ముఖ్యంగా .exe ఫైళ్లను పూర్తిగా నివారించాలన్న సూచనలు అందాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సందేహాస్పద సమాచారాన్ని తక్షణమే నివేదించాలని కోరుతున్నారు.

ఇక మరోవైపు, భారత్ సైనికంగా కూడా గట్టి ప్రతీకారం తీసుకుంటోంది. ఇస్లామాబాద్ సహా పాక్ లోని అనేక ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపి, భారీ నష్టాన్ని కలిగించింది. డ్రోన్లను అడ్డుకుని, పలు ప్రాంతాల్లో పాక్ ఆర్మీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రస్తుతం పాకిస్తాన్ అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించినట్లు సమాచారం.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

Leave a Reply